Online Games: పార్లమెంట్ లో హల్ చల్ చేసిన ఆన్ లైన్ గేమ్స్ అంశం.. ఎందుకు ఈ గేమ్స్ ను నియంత్రించాలంటున్నారు తెలుసుకుందాం!

ఆన్ లైన్ గేమ్స్ నియంత్రణపై పార్లమెంట్ లో ప్రశ్నల పరంపర దూసుకువచ్చింది. ఆన్ లైన్ గేమ్స్ ను నియంత్రించాలని 2021,డిసెంబర్ 3న కేంద్రాన్ని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ కోరారు.

Online Games: పార్లమెంట్ లో హల్ చల్ చేసిన ఆన్ లైన్ గేమ్స్ అంశం.. ఎందుకు ఈ గేమ్స్ ను నియంత్రించాలంటున్నారు తెలుసుకుందాం!
Online Games

Online Games: ఆన్ లైన్ గేమ్స్ నియంత్రణపై పార్లమెంట్ లో ప్రశ్నల పరంపర దూసుకువచ్చింది. ఆన్ లైన్ గేమ్స్ ను నియంత్రించాలని 2021,డిసెంబర్ 3న కేంద్రాన్ని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ కోరారు. అది సాధ్యం కాకుంటే ఆన్ లైన్ గేమింగ్ ఏకరూప(యూనిఫాం) పన్ను విధించాలని ఆయన సూచించారు. పిల్లలు, యువతలో ఆన్ లైన్ గేమ్స్ వ్యసనం విపరీతంగా పెరిగిపోతుండడంపై ఆయన ఆందోలన్ వ్యక్తం చేశారు. ఆన్ లైన్ గేమ్స్ కు కోట్ల కొద్దీ పిల్లలు బానిసలుగా మారుతున్నారని పార్లమెంట్ లో వ్యాఖానించారు ఎంపీ. ఇది వారి భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారాయన. ఆన్ లైన్ గేమింగ్ క్రమంగా గ్యాంబ్లింగ్, బెట్టింగ్ గా పరిణామం చెందాయన్న సభ్యుడు..యువత, పిల్లలు గ్యాంబ్లింగ్ పాల్పడుతూ డబ్బును వృథా చేస్తున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఇది నైపుణ్యానికి చెందిన ఆట లేదా అవకాశం దొరికితే ఆడే ఆటనా అన్న విషయాలు తేల్చాల్సిన అవసరం ఉందని సుశీల్ కుమార్ అన్నారు. ఆన్ లైన్ గేమ్స్ కు బానిసలుగా మారి విలువైన సమయం, డబ్బు కోల్పోతున్నారని పార్లమెంట్ సభ్యుడు సుశీల్ కుమార్ మోడీ వ్యాఖ్యానించారు. మొత్తంగా ఆన్ లైన్ గేమింగ్ నిరోధించాల్సిన ఆవశ్యకతను ఆయన విస్పష్టంగా సభలో ప్రస్తావించారు.

ఆన్ లైన్ గేమ్స్ నియంత్రణకు సమగ్ర చట్టం చేస్తుందా ? లేదా పెరుగుతున్న ఆన్ లైన్ గేమింగ్ తో ఆదాయం సృష్టించే ఉపాయాలేమైనా ప్రభుత్వం వద్ద ఉన్నాయా అన్నదే ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న ప్రశ్నలు.

దేశంలో ఆన్ లైన్ గేమ్స్ తీరెలా ఉందో పరిశీలిస్తే..

 • 2016 భారత్ లో ఆన్ లైన్ గేమింగ్ బజార్ రూ.4వేల కోట్లు
 • 2021లో దేశంలో ఆన్ లైన్ గేమింగ్ విలువ రూ.7,500 కోట్లు
 • ఏటా 18 శాతం పెరుగుతున్న ఆన్ లైన్ గేమింగ్ మార్కెట్
 • 2023 నాటికి దేశంలో ఆన్ లైన్ గేమింగ్ మార్కెట్ 15,000 కోట్లకు చేరుతుందని అంచనా
 • 2020 నాటికి భారత్ లో ఆన్ లైన్ గేమ్స్ ఆడేవారి సంఖ్య 36 కోట్లు
 • 2022 నాటికి భారత్ లో ఆన్ లైన్ గేమ్స్ ఆడే వారి సంఖ్య 51 కోట్లకు చేరుతుందని అంచనా

ఆన్ లైన్ గేమ్స్ లో డబ్బులు మూడు రకాలుగా సర్క్యులేట్..

1. ఆన్ లైన్ గేమ్ రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాల్సిన మొత్తం దీనిపై ఆయా కంపెనీలు ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తాయి. 2. ప్రైజ్ మని పూల్ చేస్తారు.. అంటే గేమ్ లో పాల్గొని వ్యక్తులు నిర్ణీత మొత్తంలో డబ్బును జమచేస్తారు. గెలిచిన వారు ఈ మొత్తాన్ని తీసుకుంటారు. ఇది పన్ను పరిధిలోకి రాదు 3. ఆన్ లైన్ గేమ్స్ ఆడే సమయంలో పలు కంపెనీల ప్రకటనలు ప్రదర్శిస్తాయి. ఈ ప్రకటనల నుంచి ఆదాయంపై పన్ను ప్రభుత్వానికి అందుతుంది.

ప్రభుత్వం చట్టం చేసి ఈ మూడింటినీ కలిపి ఒక సింగిల్ టాక్స్ విధించవచ్చు

ప్రస్తుతం అందుకు విభిన్నం..

 • నైపుణ్యంపై ఆధారపడ్డ గేమ్స్ పై 18శాతం పన్ను
 • అదృష్టంపై ఆధారపడ్డ గేమ్స్ లుడో, పోకర్, రమ్మీపై 28శాతం పన్ను విధిస్తోంది ప్రభుత్వం.

విమర్శలు..

రెండూ నైపుణ్యంతో కూడిన ఆటలే అంటున్న గేమింగ్ కంపెనీలు. పేకాటలో కార్డ్స్ పంచడం, పాచికలు వేయడం, వేగంగా మొబైల్ బటన్స్ ప్రెస్ చేయడం నైపుణ్యంతో కూడిన ఆటలు అదృష్టం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు.. ఒకవేళ ప్రభుత్వం చట్టం చేస్తే రెండు రకాల గేమ్స్ పై 28శాతం పన్ను విధించే అవకాశం ఉందని వాదన ఇదే జరిగితే తమ ఆదాయం తగ్గిపోతుందన్న ఆందోళన చెందుతున్న గేమింగ్ కంపెనీలు

2020లో జరిపిన ఓ సర్వేలో అసక్తికర విషయాలు..

 • భారత్ లో ఆన్ లైన్ గేమ్స్ కోసం ఆహారం మానివేస్తున్న 20 ఏళ్ల లోపు వారు 65శాతం
 • గేమింగ్ లో పాల్గొనడానికి పేరెంట్స్ పర్సుల్లోంచి డబ్బును చోరీ చేస్తున్నారని వెల్లడి
 • గేమింగ్ వ్యసనం మనదేశానికి మాత్రమే పరిమితం కాలేదు
 • బ్రిటన్ లో ప్రతీ ఆరుగురు పిల్లల్లో ఒక బాలుడు గేమింగ్ లో పాల్గొనడానికి పేరెంట్స్ పర్సుల్లోంచి
 • డబ్బును చోరీ చేస్తున్నారని ఒక అధ్యయనంలో వెల్లడి
 • 70శాతం ఆన్ లైన్ గేమ్స్ లో లూట్ బాక్సెస్ వైపు మొగ్గుచూపుతున్న పిల్లలు. గేమ్ లో ముందుకు
 • సాగడానికి ఈ లూట్ బాక్స్ లో ఉండే ట్రిక్స్, ఇతర గేమ్ లో ఉండే అవకాశాలు తోడ్పడతాయి. ఈ లూట్
 • బాక్సెస్ కొనడానికి డబ్బులు అవసరం. ఇవి కొంటేనే ఓపెన్ అవుతాయి. బ్రిటన్లో 19ఏళ్లలోపు 11శాతం
 • పిల్లలు ఈ లూట్ బాక్స్ కొనడానికి తమ పేరెంట్స్ పర్సుల్లోంచి రూ.1,130 కోట్లు చోరీచేశారని వెల్లడి.
 • 2018లో లూట్ బాక్స్ కొనడానికి ప్రపంచవ్యాప్తంగా పిల్లలు చేసిన ఖర్చు రూ. 2,25,000 కోట్లు
 • 2025 వరకు లూట్ బాక్స్ కొనడానికి వెచ్చించే వ్యయం అంచనా రూ.3,75,000 కోట్లని అంచనా

చైనాలో కొత్త రూల్..

 • 18 ఏళ్ల లోపు పిల్లలు వారంలో కేవలం మూడు గంటలు ఆన్ లైన్ గేమ్స్ ఆడేందుకు అనుమతి
 • శుక్రవారం, శనివారం, ఆదివారం మాత్రమే ఆడడానికి అనుమతి
 • అది కూడా రాత్రి 8 నుంచి రాత్రి 9 గంటలవరకు అనుమతి
 • పిల్లల వెరిఫికేషన్ బాధ్యత గేమింగ్ కంపెనీలదే అని తెలిపిన చైనా ప్రభుత్వం
 • అమెరికా, యూరోప్ లో ఆన్ లైన్ గేమింగ్ పై ఎటువంటి ఆంక్షలు లేవు

భారత్ లో ఆన్ లైన్ గేమింగ్ నిషేధించడానికి ప్రయత్నించిన రాష్ట్రాలు ఇవే..

కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆన్ లైన్ గేమింగ్ పై ఆంక్షలు విధించాయి కాని ఈ అంశాలు కోర్టుకు వెళ్లడంతో.. విభిన్న తీర్పులు రావడంతో ఆన్ లైన్ గేమింగ్ కొనసాగుతోంది ఆన్ లైన్ రమ్మీని(జూదం) నిషేధించిన తెలంగాణ, ఏపీ, ఆస్సాం, ఒడిశా, నాగాలాండ్, సిక్కిం

దేశంలో ఏం చేస్తే మంచిది..

 • మధ్యే మార్గం అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు
 • ఆన్ లైన్ గేమింగ్ లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలి
 • యూజర్ల ఐడీ, వయసు తదితర వివరాలు తప్పనిసరిచేయాలి
 • పేరెంటల్ కంట్రోల్ వ్యవస్థ తప్పనిసరి చేయాలి.. ఫలితంగా డబ్బులు పెట్టి ఆడటాన్ని నిరోధించే అవకాశం
 • ఆన్ లైన్ గేమింగ్ ను పూర్తిగా నిషేధించకపోవడం మంచిదని కొంతమంది వాదిస్తున్నారు.
 • ఎందుకంటే వీటి ద్వారా ఉద్యోగాలు, ఉపాధి పెరుగుతుందనే కారణాన్ని వారు చూపిస్తున్నారు.
 • ఆన్ లైన్ గేమింగ్ పరిశ్రమ పన్నులు సైతం చెల్లిస్తున్నారని వారు అంటున్నారు.

మొత్తమ్మీద ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్ వ్యవహారం పార్లమెంట్ లో ప్రకంపనలు రేపింది. ఇక ప్రభుత్వం దీనిపై ఏ చర్యలు తీసుకుంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఇవి కూడా చదవండి: Omicron Tension: ఒమిక్రాన్ భయం.. ఆటోమొబైల్..ఎలక్ట్రానిక్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే..

Cryptocurrency: భారీ క్రిప్టోకరెన్సీ చోరీ.. సైబర్ దాడితో హ్యాకర్లు చేసిన పని.. ఎన్ని క్రిప్టో టోకెన్‌లను దొంగిలించారంటే..

Corona Tension: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసిన మంగోలియా ప్రతినిధి బృందంలో కరోనా కలకలం

Click on your DTH Provider to Add TV9 Telugu