Operation Sindoor: ఐ యామ్ ఏడి గన్నెర్.. ఒక్క దెబ్బకు మటాష్ అంతే.. ఇండియన్ ఆర్మీ సంచలన వీడియో
అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంపై దాడి చేయడానికి ప్రయత్నించగా భారత సైన్యం తిప్పికొట్టింది. తాజాగా పాక్ క్షిపణులను ఎలా కూల్చారో తెలిసేలా వెస్ట్రన్ కమాండ్ ఎక్స్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. అగ్ని గోడలా భారత ఆర్మీ శత్రుదేశపు మిస్సైల్స్‌ను నేలమట్టం చేసింది.

మే7న ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్తాన్‌కు అర్థరాత్రే సూర్యుడిని చూపించింది ఇండియన్ ఆర్మీ.. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో భారత్‌పై దాడి చేసింది. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంపై దాడి చేయడానికి ప్రయత్నించగా భారత సైన్యం తిప్పికొట్టింది. తాజాగా పాక్ క్షిపణులను ఎలా కూల్చారో తెలిసేలా వెస్ట్రన్ కమాండ్ ఎక్స్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. అగ్ని గోడలా భారత ఆర్మీ శత్రుదేశపు మిస్సైల్స్‌ను నేలమట్టం చేసింది.
‘నేను ఏడీ గన్.. శత్రువు కనిపిస్తే లేపేస్తా’ అనే ట్యాగ్‌లైన్‌తో రిలీజ్ చేసిన ఈ వీడియోలో ఆపరేషన్ సింధూర్‌లో ఈ గన్ అసాధారణ సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ‘ఏడీ గన్నర్’గా పిలవబడే ఈ యంత్రాంగం శత్రువు గాలి మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు స్పష్టంగా గుర్తించి.. ఖచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించగలదు. దీనికి సంబంధించిన వీడియోను వెస్ట్రన్ కమాండ్ అధికారులు తాజాగా విడుదల చేశారు.
వీడియో చూడండి..
#StrongAndCapable#OpSindoor#LayeredDefence
” From the ground, we protected the Skys”#JusticeServed@adgpi@prodefencechan1 pic.twitter.com/oiZuVKpBem
— Western Command – Indian Army (@westerncomd_IA) May 19, 2025
ఈ వీడియోలో గగనతల దాడుల దృశ్యాలు, పాకిస్థానీ డ్రోన్‌లను భారత సైన్యం కూల్చివేయడం, దాడి సమయంలో సైనికుల అప్రమత్తతను వివరంగా చూపించారు.
శత్రువులను ఎదుర్కొనే క్రమంలో సైనికులు తీసుకుంటున్న జాగ్రత్తలు ఈ వీడియోలో స్పష్టంగా కనపడుతుంది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భారత సైన్యం చూపిన ధైర్యాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు. దేశ భద్రత కోసం సైన్యం నిరంతరం మేల్కొని ఉండటాన్ని ప్రజలు గర్వంగా గుర్తిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




