Viral Video: ఇది చూశాక కూడా రన్నింగ్ రైలు ఎక్కే దమ్ముందా?… సోషల్ మీడియలో వీడియో వైరల్
ప్రమాదాలు అనూహ్యంగా జరగడం వేరు.. ప్రమాదాలను కొని తెచ్చుకోవడం వేరు.. ఆ పని ప్రమాదం అని తెలిసినా కూడా దాన్నే చేస్తుంటారు చూడు దాన్నే కొని తెచ్చుకోవడం అంటారు. ప్లాట్‌ఫామ్ మీద రన్నింగ్ రైలు ఎక్కడం ఎంత ప్రమాదకరమో తెలిసి కూడా కొంత మంది అలాగే చేస్తుంటారు. ప్రమాదాల భారిన పడుతుంటారు...

ప్రమాదాలు అనూహ్యంగా జరగడం వేరు.. ప్రమాదాలను కొని తెచ్చుకోవడం వేరు.. ఆ పని ప్రమాదం అని తెలిసినా కూడా దాన్నే చేస్తుంటారు చూడు దాన్నే కొని తెచ్చుకోవడం అంటారు. ప్లాట్‌ఫామ్ మీద రన్నింగ్ రైలు ఎక్కడం ఎంత ప్రమాదకరమో తెలిసి కూడా కొంత మంది అలాగే చేస్తుంటారు. ప్రమాదాల భారిన పడుతుంటారు.
ఇక సోషల్ మీడియాక అందుబాటులోకి వచ్చాక రీల్స్ కోసం ప్లాట్‌ఫామ్ మీద స్టంట్స్ వేస్తూ చుట్టుపక్కల వారిని కూడా ప్రమాదాల బారిన పడేస్తుంటారు. మరికొంత మంది త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవాలనే ఆతృతలో కాళ్లు చేతులు విరగ్గొట్టుకుంటారు. అలాంటి షాకంగ్ సంఘటనలకు సబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ఓ ముసలాయన రన్నింగ్ రైలు ఎక్కుతూ తాను పడిందే కాకుండా ఓ యువకుడిని సైతం కింద పడేశాడు. ఈ ఘటన కర్నాటకలో జరిగినట్లు తెలుస్తోంది. ఓ వృద్దుడు రైలు ఎక్కేందుకు రైల్వే స్టేషన్‌కు చేరుకుంటాడు. అయితే అప్పటికే రైలు కదులుతుంటుంది. అయినా అతను రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తాడు. పరుగెత్తుకుంటూ వెళ్లి జనరల్ బోగీ డోరు పట్టుకుని నిలబడతాడు. అప్పటికే అక్కడ కొంతమంది నిలబడి ఉంటారు. ఈ క్రమంలో ఆ వృద్ధుడు బ్యాలెన్స్ తప్పి.. అక్కడున్న యువకుడిని పట్టుకుంటాడు. దీంతో ఇద్దరూ అదుపు తప్పి ఒక్కసారిగా కిందపడిపోతారు. వారు కిందపడడం చూసిన వారంతా పరుగెత్తుకుంటూ వచ్చి పక్కకు లాగేస్తారు. దీంతో వారు ఎలాంటి గాయాలూ కాకుండా క్షేమంగా బయటపడతారు. కాగా, ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
వీడియో చూడండి:
View this post on Instagram
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ఈ పెద్దాయన ఎంత పని చేశాడు.. అంటూ కొందరు, ఇలాంటి పనులు చేయడం వల్ల తాము ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటివారు కూడా ప్రమాదంలోకి నెడతారని పోస్టులు పెడుతున్నారు.
