World Polluted Cities: ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ.. మొదటి 10 నగరాల్లో మూడు భారత్‌వే!
దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం రికార్డు స్థాయిలో పెరగడం పట్ల కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది.

World Polluted Cities: దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం రికార్డు స్థాయిలో పెరగడం పట్ల కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీకి సమీప రాష్ట్రాల్లోని పొలాల మంటల నుండి వచ్చే పొగ ప్రమాదకర సమ్మేళనంతో పాటు వాహన కాలుష్యం, ఉష్ణోగ్రత తగ్గుదల, గాలి వేగం కారణంగా ఢిల్లీలో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని పేర్కొంది. ఇదిలావుండగా, ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్‌మెంటల్ ప్రోగ్రామ్‌లో సాంకేతిక భాగస్వామి కూడా అయిన స్విట్జర్లాండ్‌కు చెందిన క్లైమేట్ గ్రూప్ IQAir నుండి గాలి నాణ్యత, కాలుష్య నగర ట్రాకింగ్ సేవలకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా పది నగరాల జాబితాలో భారతదేశం నుండి మూడు నగరాలు ఉన్నట్లు తెలిపింది.
కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం.. ఢిల్లీని పొగ మంచు కమ్మేయడంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 556ని తాకింది. గాలిలో ఈ స్థాయి కాలుష్యం ఉంటేగాలి ఆరోగ్యకరమైన వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే వ్యాధులతో బాధపడుతున్న వారిపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. పొల్యూషన్ బోర్డ్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ప్రకారం.. గాలిలో కాలుష్యం 48 గంటలపాటు తీవ్రంగా ఉంటుంది. IQAir సర్వీస్ జాబితా ప్రకారం సగటు AQI 556తో ఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా, మొత్తం జాబితాలో కోల్‌కతా నాల్గోవ స్థానంలో, ముంబై ఆరవ స్థానంలో ఉన్నాయి. అధ్వాన్నమైన AQI సూచికలు ఉన్న నగరాలలో పాకిస్తాన్‌లోని లాహోర్, చైనాలోని చెంగ్డూ నగరాలు ఉన్నట్లు జాబితా చెబుతోంది.
IQAir ప్రకారం కాలుష్య ర్యాంకింగ్స్ కలిగిన పది నగరాలు ఇలా ఉన్నాయి:
1. ఢిల్లీ, భారతదేశం (AQI: 556)
2. లాహోర్, పాకిస్తాన్ (AQI: 354)
3. సోఫియా, బల్గేరియా (AQI: 178)
4. కోల్‌కతా, భారతదేశం (AQI: 177)
5. జాగ్రెబ్, క్రొయేషియా (AQI: 173)
6. ముంబై, భారతదేశం (AQI: 169)
7. బెల్‌గ్రేడ్, సెర్బియా (AQI: 165)
8. చెంగ్డు, చైనా (AQI: 165)
9. స్కోప్జే, ఉత్తర మాసిడోనియా (AQI: 164)
10. క్రాకో, పోలాండ్ (AQI: 160)
ముఖ్యంగా, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (IITM) డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ (DSS) అంచనాలు ప్రకారం ఢిల్లీలో గాలి నాణ్యత, కాలుష్య భాగాలను గుర్తించే సూచనలను అందిస్తాయి. శుక్రవారం, ఢిల్లీ ఇతర నగరాల నుండి కూడా కాలుష్య కారకాలను అందుకుంది. ఝజ్జర్, గురుగ్రామ్, బాగ్‌పట్, ఘజియాబాద్ మరియు సోనేపట్.
దీపావళి తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం అమాంతం పెరిగిపోయింది. ఒక క్యూబిక్ మీటర్ గాలిలో PM2.5 గాఢత సగటున 329 మైక్రోగ్రాములు ఉంది. 2.5 మైక్రోమీటర్ల కంటే తక్కువ వ్యాసం కలిగిన అల్ట్రాఫైన్ పార్టిక్యులేట్ పదార్థంలో 15 శాతం వరి పొట్టు మంటలతో వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం.. 24 గంటల వ్యవధిలో ఒక క్యూబిక్ మీటర్ గాలికి 60ఎంజీలు సురక్షితమైనది. PM2.5 ఊపిరితిత్తులలోకి నేరుగా ప్రయాణించి, రక్త ప్రసరణలో ప్రవేశించేంత చిన్న రేణువులు. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు కారణం కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. DSS విశ్లేషణ ప్రకారం, శుక్రవారం నాడు, ఢిల్లీలో PM 2.5 గా ఉంది. అలాగే, స్థానిక వాహన పొగల వల్ల 25 శాతం వాటా ఉంది. గృహాల నుండి వెలువడే ఉద్గారాలు 7 శాతంగా ఉంది. ఢిల్లీ, దాని పరిధులలోని నలుసు స్థాయిలు, పరిశ్రమల శాతం నగరం కాలుష్య ప్రొఫైల్‌లో 9-10 శాతం వరకు ఉన్నాయి. కేంద్ర భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ యొక్క ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్ అయిన SAFAR, శుక్రవారం గాలిలో కనీసం 35 శాతం కాలుష్య కారకాలకు మొండి మంటలు కారణమని తెలిపింది.
అయితే, శీతాకాలంలో వాయు కాలుష్యానికి కారణమవుతున్న పంట వ్యర్థాలను కాల్చివేతలను తగ్గించడానికి గత నాలుగేళ్లుగా వేల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నా ప్రయోజనం మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత రాజధానుల్లో ఢిల్లీ తొలి స్థానంలో నిలవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.