AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rachita Ram: పెళ్లి తర్వాత జనాలు ఏం చేస్తారు.? సంచలనంగా మారిన కన్నడ బ్యూటీ కామెంట్స్‌. బ్యాన్‌ చేయాలంటూ డిమాండ్స్‌..

Rachita Ram: సెలబ్రిటీలు కొన్ని వ్యాఖ్యలు తెలిసి చేస్తారో.. తెలియక చేస్తారో తెలియదు కానీ అవి తీవ్ర వివాదానికి దారి తీస్తుంటాయి. మరీ ముఖ్యంగా సినీ తారలు చేసే కొన్ని వ్యాఖ్యలు రచ్చకు దారి తీస్తుంటాయి. తాజాగా ఇలాంటి వ్యాఖ్యలే..

Rachita Ram: పెళ్లి తర్వాత జనాలు ఏం చేస్తారు.? సంచలనంగా మారిన కన్నడ బ్యూటీ కామెంట్స్‌. బ్యాన్‌ చేయాలంటూ డిమాండ్స్‌..
Rachita Ram
Narender Vaitla
|

Updated on: Nov 13, 2021 | 6:31 PM

Share

Rachita Ram: సెలబ్రిటీలు కొన్ని వ్యాఖ్యలు తెలిసి చేస్తారో.. తెలియక చేస్తారో తెలియదు కానీ అవి తీవ్ర వివాదానికి దారి తీస్తుంటాయి. మరీ ముఖ్యంగా సినీ తారలు చేసే కొన్ని వ్యాఖ్యలు రచ్చకు దారి తీస్తుంటాయి. తాజాగా ఇలాంటి వ్యాఖ్యలే చేసి చిక్కులో పడ్డారు కన్నడ బ్యూటీ రంచితా రామ్‌. ఈ హీరోయిన్‌ ఇటీవల ‘లవ్‌ యూ రచ్చు’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో బోల్డ్‌ కంటెంట్‌ ఎక్కువ ఉందంటూ పలు విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ మీడియాలో సమావేశంలో కొంతమంది విలేకరుల నుంచి ఆమెకు మరోసారి ఇదే ప్రశ్న ఎదురైంది.

‘లవ్‌ యూ రచ్చు’ సినిమాలో బోల్డ్‌ పాత్రలో నటించడపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి కదా.. వీటిపై మీరు ఎలా స్పందిస్తారు.? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు నటిగా ఘూటాగు స్పందించారు. మొదట.. కథ డిమాండ్ చేయడం వల్లే తాను అలాంటి బోల్డ్‌ సన్నివేశాల్లో నటించాల్సి వచ్చిందని చెప్పిన రంచితా అంతటితో ఆగకుండా.. అక్కడ ఉన్న విలేకరులను ఉద్దేశిస్తూ..’ఇక్కడ చాలా మంది పెళ్లైన వారునున్నారు. ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దని ఇలా అడగడం లేదు.. సాధారణంగా జనాలు పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేస్తారు? రొమాన్స్‌ చేస్తారు అంతేకదా.. సినిమాలో కూడా అదే చూపించాం. నేను ఈ సన్నివేశాల్లో నటించడానికి ఓ కారణం ఉంది. సినిమా చూస్తే ఆ విషయం మీకూ అర్థమవుతుంది’ అంటూ కామెంట్ చేసింది.

ఇక ఈ హీరోయిన్‌ చేసిన కామెంట్స్‌ ప్రస్తుతం పెద్ద చర్చకు దారి తీసింది. వెంటనే ఈమెపై నిషేధం విధించాలని కన్నడ క్రాంతి దళ్‌ డిమాండ్‌ చేస్తోంది. అంతేకాకుండా కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను కోరింది. మరి నటి చేసిన వ్యాఖ్యల వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

Also Read: Inspiring Teacher: ఇలాంటి టీచర్ కోటికి ఒక్కరే ఉంటారు.. స్టూడెంట్స్ చదువుల కోసం సొంత నగలు అమ్మేసిన ఉపాధ్యాయురాలు..

Aadhaar Update: మీ ఆధార్‌లో పేరు, చిరునామా, ఫోన్‌ నంబర్‌ను ఎలా మార్చుకోవాలి.. పూర్తి వివరాలు

Inspiring Teacher: ఇలాంటి టీచర్ కోటికి ఒక్కరే ఉంటారు.. స్టూడెంట్స్ చదువుల కోసం సొంత నగలు అమ్మేసిన ఉపాధ్యాయురాలు..