RBI Curbs: మరో బ్యాంకుపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆంక్షలు.. ఇక నుంచి ఈ బ్యాంకు నుంచి ఖాతాదారులు రూ.1000 కంటే ఎక్కువ విత్‌డ్రా చేయలేరు..!

RBI Curbs: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పలు బ్యాంకులపై కొరఢా ఝులిపిస్తోంది. ఆర్బీఐ నిబంధనలు పాటించని బ్యాంకులపై..

RBI Curbs: మరో బ్యాంకుపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆంక్షలు.. ఇక నుంచి ఈ బ్యాంకు నుంచి ఖాతాదారులు రూ.1000 కంటే ఎక్కువ విత్‌డ్రా చేయలేరు..!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 13, 2021 | 6:17 PM

RBI Curbs: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పలు బ్యాంకులపై కొరఢా ఝులిపిస్తోంది. ఆర్బీఐ నిబంధనలు పాటించని బ్యాంకులపై ఆంక్షలు విధిస్తోంది. పలు బ్యాంకులపై భారీ ఎత్తున జరిమానా విధిస్తుండగా, మరి కొన్ని బ్యాంకులపై నిబంధనలతో కూడిన ఆంక్షలు విధిస్తోంది. ఇక తాజాగా లక్ష్మీ సహకార బ్యాంక్‌ లిమిటెడ్‌ షోలాపూర్‌పై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించింది. బ్యాంకు ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలో సెంట్రల్‌ బ్యాంక్‌ ఈ చర్యకు దిగింది. బ్యాంకు ఖాతాదారులకు, వారి ఖాతాల నుంచి రోజు వారి విత్‌డ్రా పరిమితి రూ.1000 నిర్ణయించింది. ఖాతాదారులు అంతకంటే ఎక్కవ చేయలేరు. బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌, 1949 కింద విధించిన షరతులు నవంబర్ 12, 2021న పని వేళలు ముగిసిన తర్వాత ఆరు నెలల పాటు అమలులో ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. రిజర్వ్‌ బ్యాంక్‌ వివరాల ప్రకారం.. లక్ష్మీ సహకార బ్యాంకు ఆర్బీఐ అనుమతి లేకుండా ఎవ్వరికి కూడా రుణాలు ఇచ్చేందుకు అనుమతి ఉండదు. దీంతో పాటు బ్యాంకులో ఎలాంటి పెట్టుబడులు గానీ.. చెల్లింపులకు అనుమతి ఇవ్వ కూడదు. ఇలా పలు నిబంధనలతో ఆంక్షలు విధిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఎలాంటి లావాదేవీల్లో అయినా ఆర్బీఐ సూచనల మేరకు చేయాల్సి ఉంటుంది.

అలాగే ఆర్బీఐ రెండు కొత్త పథకాలను ప్రారంభించింది. వీటిలో రిటైల్‌ డైరెక్ట్‌ స్కీమ్‌, ఇంటర్నల్‌ అంబుడ్స్‌మన్‌ స్కీమ్‌లు ఉన్నాయి. దీని వల్ల పెట్టుబడిదారులు, కస్టమర్లు లాభడపతారు. రిటైల్‌ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్‌లోకి ప్రవేశం కల్పించడమే ఆర్‌బీఐ రిటైల్‌ డైరెక్ట్‌ స్కీమ్‌ లక్ష్యం అని ఆర్బీఐ ప్రధాన కార్యాలయం వెల్లడించింది. పెట్టుబడిదారులు నేరుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టుబడిదారులు సెక్యూరిటీ ఖాతాలను ఉచితంగా ఓపెన్‌ చేయవచ్చు.

మరో బ్యాంకుపై..

కాగా, మహారాష్ట్రకు చెందిన బాబాజీ డేట్‌ మహిళా సహకారి బ్యాంక్‌, యవత్మాల్‌కు ఇటీవల ఆర్బీఐ షాకిచ్చింది. సహకార బ్యాంకు ఆర్థిక పరిస్థితి క్షీణిస్తున్న నేపథ్యంలో సెంట్రల్‌ బ్యాంక్‌ ఈ చర్యలకు దిగింది. బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌, 1949 కింద విధించిన ఆంక్షలు నవంబర్‌ 8, 2021 ముగిసిన నాటి నుంచి ఆంక్షలు విధించింది. విత్‌డ్రా పరిమితులపై షరతులు విధించింది. ఈ కారణంగా బ్యాంకు వినియోగదారులపై ప్రతికూల ప్రభావం పడే అకాశం ఉంది. బ్యాంకు కస్టమర్ల ఖాతాల్లో ఎంత డబ్బు ఉన్న కేవలం రూ.5వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా బ్యాంకు ఇకపై కొత్త డిపాజిట్లు తీసుకోకూడదని ఆంక్షలు పెట్టింది. అలాగే కస్టమర్లకు ఎలాంటి రుణాలు ఇవ్వకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది ఆర్బీఐ. అయితే బ్యాంక్ ప్రస్తుత లిక్విడిటీ పొజిషన్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

Aadhaar Update: మీ ఆధార్‌లో పేరు, చిరునామా, ఫోన్‌ నంబర్‌ను ఎలా మార్చుకోవాలి.. పూర్తి వివరాలు

SBI Customers Alert: ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు షాక్‌.. ఇక నుంచి ఆ లావాదేవీలపై ప్రాసెసింగ్‌ ఫీజు, పన్ను వసూలు..!