AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kerala: మహిళకు రాజకీయ ప్రాధాన్యతని ఇస్తూ కేరళ అసెంబ్లీ సంచలన నిర్ణయం.. మహిళా స్పీకర్ ప్యానెల్‌ ఏర్పాటు

ఇప్పుడు కేరళ రాష్ట్రం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళలు తాము ఇచ్చే ప్రాధాన్యతను తెలియజేస్తూ..  కేరళ అసెంబ్లీ చరిత్రాత్మకంగా తొలిసారిగా మహిళా స్పీకర్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.

Kerala: మహిళకు రాజకీయ ప్రాధాన్యతని ఇస్తూ కేరళ అసెంబ్లీ సంచలన నిర్ణయం.. మహిళా స్పీకర్ ప్యానెల్‌ ఏర్పాటు
Kerala Assembly Women Speak
Surya Kala
|

Updated on: Dec 05, 2022 | 12:31 PM

Share

మహిళలు అన్నింటా సమానం.. మగవారి కంటే ఎందులోనూ తక్కువ కాదు.. అంబరాన్ని అందుకుంటున్నారు.. సముద్రం లోతులను కొలుస్తున్నారు.. విద్య, వైద్య, వ్యాపార రంగంతో సహా విభిన్న రంగంలో తమ ప్రతిభను చాటుతూ.. విజయాలను సొంతం చేసుకుంటున్నారు. దేశానికి మహిళా ప్రధానిగా పనిచేసిన ఇందిరాగాంధీ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. తన దైన శైలి.. పాలనలో దేశ రాజకీయాల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతించారు.. అయినప్పటికీ దేశ రాజకీయంగా మాత్రం మహిళలు తగిన ప్రధాన్యత దక్కడం లేదనే వాదన తరచుగా వినిపిస్తోంది. అయితే ఇప్పుడు కేరళ రాష్ట్రం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళలు తాము ఇచ్చే ప్రాధాన్యతను తెలియజేస్తూ..  కేరళ అసెంబ్లీ చరిత్రాత్మకంగా తొలిసారిగా మహిళా స్పీకర్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది

కేరళ శాసనసభకు తొలిసారిగా మహిళా స్పీకర్ ప్యానెల్ ఏర్పాటు కానుంది. ప్రభుత్వం తరపున శాసనసభ్యులు యు ప్రతిభ, సీకే ఆషా.. ప్రతిపక్షాల తరపున ఎమ్మెల్యే కేకే రెమ ప్రాతినిధ్యం ఈ ప్యానెల్ కు ప్రాతినిధ్యం వహిస్తారు. మహిళా అభ్యర్థుల పేర్లను ప్యానెల్‌కు పరిశీలించాలని కొత్త అసెంబ్లీ స్పీకర్ ఎంఎన్ శ్యాంసీర్ సిఫార్సు చేశారు. స్పీకర్ , డిప్యూటీ స్పీకర్ అసెంబ్లీ సమావేశాల సమయంలో లేనప్పుడు స్పీకర్ ప్యానెల్‌లోని ఎవరైనా అసెంబ్లీ కార్యకలాపాలను నియంత్రించాల్సి ఉంటుంది.

కేరళలో ప్రస్తుత శాసనసభ ఏడో సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం నాల్గవ సెషన్ డిసెంబర్ 5 నుండి 15 వరకు షెడ్యూల్ చేయబడింది. దీనికి స్పీకర్ షంసీర్ అధ్యక్షత వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..