రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..ప్రధాని మోదీ అధ్యక్ష్తతన నేడు అఖిల పక్ష సమావేశం

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఆదివారం అఖిల పక్ష సమావేశం జరగనుంది. సభా కార్యకలాపాలు సజావుగా జరిగేందుకు విపక్ష సభ్యులంతా ప్రభుత్వానికి

రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..ప్రధాని మోదీ అధ్యక్ష్తతన నేడు అఖిల పక్ష సమావేశం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jul 18, 2021 | 12:25 PM

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఆదివారం అఖిల పక్ష సమావేశం జరగనుంది. సభా కార్యకలాపాలు సజావుగా జరిగేందుకు విపక్ష సభ్యులంతా ప్రభుత్వానికి సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ కోరారు. ఈ సమావేశాల్లో 30 బిల్లులను సభలో ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. దేశంలో కోవిడ్ పాండమిక్,, ద్రవ్యోల్బణం తదితర అంశాలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయనున్నాయి. రైతుల నిరసన, జనాభా అదుపు పాలసీ వంటి అంశాలపై అటు విపక్ష, ఇటు పాలక పార్టీ ఎంపీలు కూడా ఉభయ సభల్లో ప్రస్తావించవచ్చు. కోవిడ్ మేనేజ్ మెంట్ పై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఇతర విపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పాండమిక్ తరుణంలో ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సభ్యులు ప్రస్తావించాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు నిన్న నిర్వహించిన సమావేశంలో సభ్యులను కోరారు.

సభ హుందాగా నడిచేందుకు సభ్యులంతా సహకరించాలన్నారు. ఈ మీటింగ్ లో 20 పార్టీలకు చెందిన నేతలు పాల్గొని తమ సూచనలు చేశారు. భౌతిక దూరం పాటింపుతో పరిమిత సంఖ్యలో అధికారులు, స్టాఫ్ ఈ సభలు ఏకకాలంలో కొనసాగేందుకు అన్ని చర్యలూ తీసుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకు ఉభయసభలు జరుగుతాయని, జీరో అవర్, క్వశ్చన్ అవర్ కూడా ఉంటాయని అధికారులు తెలిపారు. కోవిడ్ పాండమికి మొదటి దశలో ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేసిన విషయం గమనార్హం. అయితే ఈ సారి ఈ కార్యక్రమం కూడా ఉంటుందని అధికారులు తెలిపారు. జులై 19 నుంచి మొదలయ్యే సమావేశాలు ఆగస్టు 13 వరకు కొనసాగుతాయి.

మరిన్ని ఇక్కడ చూడండి : వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు గ్రేట్ గుడ్ న్యూస్.. వచ్చే రెండేళ్లపాటు రిమోట్ పని..:Knowlodge Video.

 బామ్మకు మనవరాలి అరుదైన సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌..!ఆనందంతో ఎం చేసిందో తెలుసా..!:Rare Gift to Grandma Video.

 Viral Video: ఒలింపిక్‌ కిట్‌తో సానియా డ్యాన్స్‌ అదుర్స్‌…వైరల్ అవుతున్న వీడియో..:Sania Mirza Dance Video.

పెంపుడు కుక్కలకు ఆమె తొలి పరిచయం.. బిత్తరపోయిన మొహాలు చూసుకున్న శునకాలు వీడియో..:Pet Dog Video.