Darbhanga blast : నసీర్‌ మాలిక్‌, ఇమ్రాన్‌ మాలిక్‌ ఖతర్నాక్ స్ట్రేటజీ.. దర్భంగ బ్లాస్ట్ కేసులో తలెక్కడపెట్టుకోవాలో తెలీని ట్విస్ట్..!

దర్భంగ బ్లాస్ట్ కేసులలో అరెస్ట్ అయిన నసీర్‌ మాలిక్‌, ఇమ్రాన్‌ మాలిక్‌ పోలీసులకు కుచ్చుటోపీ పెట్టారు. ఈ నెల 23 వరకూ వీరికి కోర్టు జ్యూడిషియల్ రిమాండ్ విధించిన నేపథ్యంలో వాళ్లను కోర్టుకు తీసుకెళ్తున్న టైమ్‌లో..

Darbhanga blast : నసీర్‌ మాలిక్‌, ఇమ్రాన్‌ మాలిక్‌ ఖతర్నాక్ స్ట్రేటజీ.. దర్భంగ బ్లాస్ట్ కేసులో తలెక్కడపెట్టుకోవాలో తెలీని ట్విస్ట్..!
Darbhanga Blast Case
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 18, 2021 | 10:49 AM

Nasir Malik – Imran Malik – Darbhanga blast : దర్భంగ బ్లాస్ట్ కేసులో అరెస్ట్ అయిన నసీర్‌ మాలిక్‌, ఇమ్రాన్‌ మాలిక్‌ పోలీసులకు కుచ్చుటోపీ పెట్టారు. ఈ నెల 23 వరకూ వీరికి కోర్టు జ్యూడిషియల్ రిమాండ్ విధించిన నేపథ్యంలో వాళ్లను కోర్టుకు తీసుకెళ్తున్న టైమ్‌లో.. ఓ సెన్సేషన్ పాయింట్ బయటపడింది. వాళ్ల బ్యాగుల్లో బ్లూటూత్, వాకీటాకీ లాంటి వైర్‌లెస్‌ డివైజ్‌లు దొరికాయి. ఎంత సిగ్గుచేటిది.. ! అరెస్ట్‌కు ముందే వాళ్ల ఇళ్లు గాలించి, దుస్తుల దగ్గరి నుంచి అన్నీ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రోజుల తరబడి వాళ్ల వెంబడి విచారణ జరిగింది. హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేసి, ఢిల్లీకి తరలించి, హైదరాబాద్‌కు తీసుకొచ్చి, మళ్లీ దర్భాంగ వరకూ వెళ్లి, సీన్ రీకన్‌స్ట్రక్ట్ చేసి.. చివరికి NIA కోర్టుకు తరలిస్తుంటే.. ఇప్పుడు బ్యాగుల్లో ఎలక్ట్రానిక్ డివైజ్‌లు బయటపడడమా? ఎంత ఖతర్నాక్ గాళ్లు కాకపోతే.. అరెస్ట్ అయ్యాక కూడా ఎంత మేనేజ్ చేశారు. వాళ్లు చేశారు సరే, అప్పటి వరకూ కనిపెట్టకుండా అధికారులు మాత్రం ఎలా ఉన్నారన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్.

ఇన్నాళ్ల వీళ్ల విచారణలో తేలింది ఏంటంటే.. బాటిల్ బాంబు కుట్ర వెనుక ముఖ్య నాయకుడు ఇక్బాల్ అని నిర్దారించింది NIA. లష్కరే తోయిబా చీప్ హఫీజ్ సయిద్‌తోపాటు.. అండర్ వల్డ్‌ డాన్‌ డాన్ మోమేన్‌తో కలిసి భారత్‌లో పేలుళ్లకు కుట్ర చేశాడు ఇక్బాల్‌. వాళ్ల ఆదేశాలతో వ్యూహం రచించిన ఇక్బాల్, ఆ ప్లాన్‌ని ఎగ్జిక్యూట్ చేసేందుకు సొంత గ్రామం అయినా ఖైరానాలో యువకులతో పరిచయాలు పెంచుకున్నాడు. పాకిస్థాన్ నుంచి ఆదేశాలు అందుకోవడం, ఇక్కడి నుంచి అప్‌డేట్స్ ఇవ్వడానికి ఇక్బాల్‌ ఇంటర్నెట్‌ వాయిస్ కాల్స్ మాట్లాడేవాడు. అయితే ఇంటర్నెట్ వినియోగం రాకపోవడంతో ఆ పనికి ఖలీల్‌ అనే వ్యక్తిని నియమించుకున్నాడు. సో.. ఈ కేసులో ఖలీల్ అనే కొత్త ముఖం కూడా తెరపైకి వచ్చిందన్నమాట. ఖలీం సోషల్‌ మీడియా ఖాతాను పాక్‌ ఉగ్రనేతలతో మాట్లాడేవాడు ఖలీల్‌.

మరో సెన్సేషన్ ఏంటంటే.. ఒక్క బ్లాస్ట్‌కు కోటి రూపాయలు. ఈ ఆశ పెట్టే మాలిక్‌ బ్రదర్స్‌ను తమదారికి తెచ్చుకున్నాడు ఇక్బాల్. భారత్‌లో ఎలా అల్లర్లు సృష్టించాలి.. ఎలా ప్రాణాలు తీయాలనే దానిపై 2012లోనే స్కెచ్ వేశాడు ఇక్బాల్ హాజీ సలీం. అప్పట్లోనే పాక్-ఆప్గన్ సరిహద్దుల్లో ఉగ్రనాయకులను కలిసి ప్లాన్ వేశారు. ఒక్కోదాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. ఈ మధ్యలో జరిగిన పేలుళ్లు, ప్రమాదాల్లో వీళ్ల హస్తం ఇంకెంత ఉందన్నది తేలాలి.

Read also: Mumbai: ముంబైలో ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి