Mumbai: ముంబైలో ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి 23 మంది మృతి
మహారాష్ట్రలో పెనుముప్పు సంభవించింది. భారీ వర్షాలు.. వరద ప్రవాహం నేపథ్యంలో కొండచరియలు విరిగి పూరి గుడిసెల మీద పడ్డాయి...

landslide in Mumbai’s Chembur: మహారాష్ట్రలో పెనుముప్పు సంభవించింది. భారీ వర్షాలు.. వరద ప్రవాహం నేపథ్యంలో కొండచరియలు విరిగి పూరి గుడిసెల మీద పడ్డాయి. ఈ దుర్ఘటనలో ఏకంగా 23 మంది ప్రాణాలు కోల్పోయారు.

Mumbai Chembur
ముంబైలోని చెంబూర్ భారత్ నగర్, విక్రోలీ ప్రాంతంలో ఈ ప్రమాదం నెలకొంది. స్థానికులతోపాటు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టాయి.

Chembur
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు సుమారు 15 మందిని రక్షించి చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు.ఇంకా చాలా మంది శిధిలాల లోపల చిక్కుకున్నందున మరణాల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు.

Mumai Landslide Incident
కాగా, మహారాష్ట్ర, ముఖ్యంగా ముంబైలో పది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఫలితంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయి ఉండటంతోపాటు, ట్రాఫిక్, లోకల్ ట్రైన్స్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగి జనజీవనం స్థంభించిపోయింది.

Mumbai



