Petrol Diesel Price: కొనసాగుతున్న బాదుడు.. మళ్లీ స్వల్పంగా పెరిగిన పెట్రోల్ ధరలు.. మెట్రో నగరాల్లో..

కొండ దిగి రావమ్మాఅంటూ ఎన్ని మొక్కులు మొక్కిన పెట్రోల్ ధరలు దిగిరావడం లేదు. రోజు రోజుకు మరింత పైకి ఎగబాగుతోంది. పెట్రోల్ బాటలో ఇప్పుడు డీజిల్‌ కూడా చేరబోతోంది.

Petrol Diesel Price: కొనసాగుతున్న బాదుడు.. మళ్లీ స్వల్పంగా పెరిగిన పెట్రోల్ ధరలు.. మెట్రో నగరాల్లో..
Petrol Diesel Price India Today
Follow us

| Edited By: Sanjay Kasula

Updated on: Jul 18, 2021 | 9:11 AM

Petrol-Diesel Rates Today: కొండ దిగి రావమ్మాఅంటూ ఎన్ని మొక్కులు మొక్కిన పెట్రోల్ ధరలు దిగిరావడం లేదు. రోజు రోజుకు మరింత పైకి ఎగబాగుతోంది. పెట్రోల్ బాటలో ఇప్పుడు డీజిల్‌ కూడా చేరబోతోంది. రూ. 99పైకి ఎగబాకింది. ఇక వాహనం నడపాలంటేనే వణికిపోతున్నారు వాహనదారులు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.  అయితే అధికారిక సమాచారం ప్రకారం.. ఆదవారాం నాడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.83గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 97.96గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.98 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.98.99గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 106.44గా ఉండగా.. డీజిల్ ధర రూ. 98.50గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.22గా ఉండగా.. డీజిల్ ధర రూ.98.32గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.83ఉండగా.. డీజిల్ ధర రూ.97.96 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.38 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.52గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.108.11కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 99.80 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.107.11 ఉండగా.. డీజిల్ ధర రూ.98.43గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.11లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.99.58గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.63 గా ఉండగా.. డీజిల్ ధర రూ.99.96గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 108.11లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.99.70 లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.84గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.87 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.83కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.45గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.102.08 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 93.02 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.49ఉండగా.. డీజిల్ ధర రూ.94.45గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.105.25 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.95.26 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.92 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.90.26గా ఉంది.

ఇవి కూడా చదవండి: viral video: కుక్కలు వెంటాడితే ఇలా కూడా చేస్తారా.. యువతి చేసిన పని చూస్తే మతి పోవడం ఖాయం..

IRCTC Tatkal Ticket: ఈ చిన్న చిట్కాతో తత్కాల్ ట్రైన్ టికెట్ బుకింగ్ చాలా ఈజీ.. ఓ సారి మీరు ట్రై చేయండి..

Tirumala Laddu: కొత్త ప్యాకింగ్‌లో తిరుమల లడ్డూ.. కూరగాయల వ్యర్థాలతో లడ్డు బ్యాగ్.. ఎలా తయారు చేస్తారో తెలుసా..