Cordon and search : వరుస కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు చేస్తున్న పోలీసులు .. కేటుగాళ్లపై ఉక్కుపాదం.!
మంచిర్యాల, నిర్మల్ జిల్లాలలో పోలీసులు వరుస కార్డన్ సర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. అక్రమ దందాలకు పాల్పడే వాళ్లని అదుపులోకి..
cordon and search operation : తెలంగాణలోని మంచిర్యాల, నిర్మల్ జిల్లాలలో పోలీసులు వరుస కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. అక్రమ దందాలకు పాల్పడే వాళ్లని అదుపులోకి తీసుకుంటున్నారు. అనుమానితుల్ని అరెస్ట్ చేయడంతోపాటు, సరైన ధృవపత్రాలు లేని వాహనాలు సీజ్ చేస్తున్నారు.
నిర్మల్ జిల్లా మామడ మండలం పరిమండల్ గ్రామంలో ఈ తెల్లవారుజాము నుంచి కార్డాన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడలో ఏఆర్ డీసీపీ సంజీవ్ ఆధ్వర్యంలో సెర్చ్ ఆపరేషన్ జరిగింది. ఈ దాడుల్లో సరైన ధ్రువపత్రాలు లేని 70 బైకులు, 6. ఆటోలు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా నిల్వ ఉంచిన కలప, 7 లీడర్ల నాటుసారాను సీజ్ చేశారు. నాటుసారా తయారు చేస్తున్న ఇద్దరి అరెస్ట్ చేశారు. నిన్న కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించిన సంగతి తెలిసిందే.
Read also: Mumbai: ముంబైలో ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి