Bullet Train: బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు పనులు వేగవంతం.. అన్ని అనుమతులు మంజూరు: ఉప ముఖ్యమంత్రి

Bullet Train: మహారాష్ట్రలో ప్రభుత్వం మారడంతో ఇప్పుడు పలు ప్రాజెక్టులు స్పీడ్‌గా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు అన్ని అనుమతులు లభించాయని రాష్ట్ర ఉప..

Bullet Train: బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు పనులు వేగవంతం.. అన్ని అనుమతులు మంజూరు: ఉప ముఖ్యమంత్రి
Bbullet Train
Follow us
Subhash Goud

|

Updated on: Jul 14, 2022 | 4:03 PM

Bullet Train: మహారాష్ట్రలో ప్రభుత్వం మారడంతో ఇప్పుడు పలు ప్రాజెక్టులు స్పీడ్‌గా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు అన్ని అనుమతులు లభించాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల్లో బుల్లెట్ రైలు ఒకటి. గత ఎంవీఏ ప్రభుత్వం ప్రాజెక్టు పనులు నెమ్మదించిందని బీజేపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వం మారడంతో బుల్లెట్ రైలు పథకం ఊపందుకుంటుందనే ఊహాగానాలు వచ్చాయి. ప్రభుత్వంలో మార్పుతో పాటు, కొత్త ప్రభుత్వంతో ఇప్పుడు ప్రాజెక్టుకు ఊతం లభిస్తుందని రైల్వే మంత్రి గత వారం ఆశాభావం వ్యక్తం చేశారు.

పనులు వేగవంతం 

మహారాష్ట్రలో బుల్లెట్ రైలు ప్రాజెక్టును వేగవంతం చేయడానికి ఎంతో కృషి చేస్తున్నామని దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. ఇది కేవలం బుల్లెట్ ట్రైన్ అనే కారణంతో కాకుండా, రైలు ప్రాజెక్టులో బుల్లె్‌ట్‌ ట్రైన్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఎంవీఏ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ.. కొన్ని కారణాల వల్ల గత ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను నిలిపివేసిందన్నారు. అదే సమయంలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో టెర్మినల్ నిర్మాణాన్ని నిలిపివేశారు. దీంతో గుజరాత్‌లో జరుగుతున్న వేగంతో మహారాష్ట్రలో పనులు జరగడం లేదు. అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ వేగవంతం కానుంది అని అన్నారు.

ఇవి కూడా చదవండి

2026 నాటికి బుల్లెట్ రైలు నడపడమే లక్ష్యం

2026 నాటికి సూరత్, బిల్మోరా స్టేషన్ల మధ్య మొదటి బుల్లెట్ రైలు ప్రారంభమవుతుందని ఆశిస్తున్నట్లు రైల్వే మంత్రి ఒక కార్యక్రమంలో చెప్పారు. 70 కి.మీ మార్గంలో పిల్లర్లు సిద్ధం చేశామన్నారు. అదే సమయంలో అహ్మదాబాద్ నుండి వాపి మధ్య 160 కి.మీ మార్గంలో పునాది పనులు జరిగాయి. మార్గం మధ్యలో పడే 8 నదులపై వంతెనల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుపై ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఉత్సాహం చూపలేదన్నారు. అయితే ఇప్పుడు గుజరాత్ లాగా మహారాష్ట్రలో కూడా పనులు వేగవంతం అవుతాయని ఫడ్నవీస్‌ తెలిపారు. 2026లో గంటకు 350 కి.మీ వేగంతో బుల్లెట్ ట్రైన్‌ను ట్రయల్స్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?