Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Avimee Herbal: కలల సాకారం కోసం వయసు ముఖ్యం కాదంటున్న 85 ఏళ్ల వృద్దుడు.. మొదటి సారి కారు కొనుగోలు

Avimee Herbal: వయస్సు అనేది ఒక సంఖ్య మాత్రమేనని, మీ కలలను సాకారం చేసేందుకు కాదని నిరూపించాడు ఓ 85 ఏళ్ల వృద్ధుడు. గుజరాత్‌కు చెందిన ఓ వృద్ధుడు ఆయుర్వేద ఉత్పత్తుల వ్యాపారాన్ని..

Avimee Herbal: కలల సాకారం కోసం వయసు ముఖ్యం కాదంటున్న 85 ఏళ్ల వృద్దుడు.. మొదటి సారి కారు కొనుగోలు
Avimee Herbal
Follow us
Subhash Goud

|

Updated on: Jul 14, 2022 | 3:10 PM

Avimee Herbal: వయస్సు అనేది ఒక సంఖ్య మాత్రమేనని, మీ కలలను సాకారం చేసేందుకు కాదని నిరూపించాడు ఓ 85 ఏళ్ల వృద్ధుడు. గుజరాత్‌కు చెందిన ఓ వృద్ధుడు ఆయుర్వేద ఉత్పత్తుల వ్యాపారాన్ని ప్రారంభించిన తర్వాత ఆ వయస్సులో తన మొదటి కారును కొనుగోలు చేసి తన కలను నిరూపించుకున్నాడు. నానాజీగా ప్రసిద్ధి చెందిన రాధా క్రిషన్ చౌదరి 85 సంవత్సరాల వయస్సులో తన భార్య శంకుతల చౌదరితో కలిసి జూన్‌ 2021లో అవిమీ హెర్బల్ అనే ఆయుర్వేద సంస్థను ప్రారంభించారు. 85 సంవత్సరాల వయస్సులో నేను నా మొదటి కారును కొనుగోలు చేశానని సోషల్‌ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు. ఆయన పోస్టు చేసిన వీడియోలో కొత్తకారును కొనుగోలు చేసి పూజలు నిర్వహిస్తుట్లు చూడవచ్చు. ఐదు రోజుల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియోకి ఇప్పటివరకు 18.5 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. క్యాప్షన్‌లో అతను తన ప్రయాణం గురించి మరింత పంచుకున్నాడు. అయితే నానాజీ జుట్టు రాలడానికి గల కారణాలను పరిశోధించారు. ఎంతో కష్టపడి 50కిపైగ మూలికలతో తన స్వంత హెయిర్‌ ఆయిల్‌ను అభివృద్ధి చేసి ముందుకు సాగాడు. ప్రస్తుతం వ్యాపార భాగస్వామిగా ఉన్న నా కుమార్తె తీవ్రమైన జుట్టు రాలడం సమస్యతో బాధపడుతోంది. దీని నివారణను కొనుగొనమని నన్ను కోరింది. దాదాపు సంవత్సరం పాటు ఈ అంశంపై అధ్యయనం చేసిన తర్వాత నేను నా కుమార్తె జుట్టు రాలడాన్ని తగ్గించడానికి మూలికా నూనెల మిశ్రమాన్ని తయారు చేశాము.. దీంతో మేము విజయం సాధించాము అని చెప్పుకొచ్చాడు.

‘మేము Avimee హెర్బల్‌ని స్థాపించాము. 6 నెలల కంటే తక్కువ వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా ప్రజల హృదయాల్లోకి ప్రవేశించాము. అందుకే ఓవర్‌నైట్ సక్సెస్ కావడానికి ఎంత సమయం పట్టింది..? అంటూ చెప్పుకొచ్చాడు. పోస్ట్ చేసినప్పటి నుండి వీడియోకు 1.2 మిలియన్లకు పైగా లైక్‌లు, అనేక కామెంట్‌లు వచ్చాయి. ‘వావ్ అభినందనలు సార్. మీరు చాలా మందికి స్ఫూర్తినిస్తున్నారు’ అని ఇన్‌స్టాగ్రామ్ యూజర్ వ్యాఖ్యానించారు. ‘నానాజీ, నానీజీ మీ పట్ల అపారమైన గౌరవం, మీరు చాలా అద్భుతంగా ఉన్నారు’ అని మరొకరు కామెంట్‌ చేశారు. ‘ఒకరు జీవించి ఉన్నంత వరకు వారి జీవితాన్ని మలుపు తిప్పవచ్చు. మీరు సాధించారు!’ అంటూ మరొక వ్యక్తి వ్యాఖ్యానించారు. ఆ వృద్ధుడి విజయంలో అతని కుటుంబం పోషించిన పాత్రను గుర్తించడంతో, అతని స్టార్టప్‌ విజయానికి దోహదపడిన చివరి రెండు పాయింట్లు హార్ట్‌వర్క్‌. టీమ్‌ వర్క్‌ ఉంది. ఏదీ ఏమైనా విజయం సాధించాలంటే వయసు ముఖ్యం కాదని, పట్టుదలతో చేస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు రాధాకృష్ణ చౌదరి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి