ఒక సిటి స్కాన్ 300 ఛాతీ ఎక్స్‏రేలతో సమానం.. చాలా డేంజర్ అంటున్న ఎయిమ్స్ డైరెక్టర్..

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మరణ మృదంగం మోగిస్తోంది. దీంతో తక్కువ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరు కరోనా పరీక్షలు చేయించుకోవడానికి

  • Rajitha Chanti
  • Publish Date - 6:06 pm, Mon, 3 May 21
ఒక సిటి స్కాన్ 300 ఛాతీ ఎక్స్‏రేలతో సమానం.. చాలా డేంజర్ అంటున్న ఎయిమ్స్ డైరెక్టర్..
Aiims Director Dr Randeep G

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మరణ మృదంగం మోగిస్తోంది. దీంతో తక్కువ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరు కరోనా పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు. అయితే చాలా చోట్ల కరోనా పరీక్షలో భాగంగా సిటి స్కాన్ చేస్తున్నారు. కరోనా కోసం సిటి స్కాన్ చేయడం ఏమాత్రం మంచిది కాదని.. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గోన్న ఆయన.. కరోనాకు సిటి స్కాన్ చేయడం వలన మరిన్ని సమస్యలు ఏర్పడతాయని.. అలాగే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. CT Scan

కరోనా లక్షణాలు తక్కువగా ఉన్నవారు ప్రతిసారి సిటి స్కాన్ చేయించుకుంటున్నారని తెలిపారు. సిటి స్కాన్, బయోమార్కర్లు ఎక్కువగా దుర్వినియోగం అవుతున్నాయని.. తక్కువ లక్షణాలు ఉన్నవారికి సిటి స్కాన్ చేయడం వలన ఎలాంటి ఉపయోగం లేదన్నారు. సిటి స్కాన్ చేయడమనేది 300 ఛాతీ ఎక్స్‏రేలకు సమానమని.. ఇది చాలా ప్రమాదమని ఎయిమ్స్ డైరెక్టర్ తెలిపారు..

ఇక దేశవ్యాప్తంగా ఎదుర్కోంటున్న ఆక్సిజన్ సమస్య గురించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లావ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఆక్సిజన్ ను కేవలం వైద్యం కోసం మాత్రమే ఉపయోగించాలని ఆలోచిస్తున్నాం. అలాగే చికిత్సకు అనువుగా ఉండే ప్రాంతాలు, పట్టణాలకు దగ్గర్లోనే ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడమే కాకుండా.. వాటి చుట్టూ ఆక్సిజనేటెడ్ పడకలతో తాత్కాలక కరోనా సంరక్షణ కేంద్రాలను తయారు చేయాలనుకుంటున్నట్లుగా తెలిపారు. అలాగే ప్రస్తుతం దేశంలో రికవరీల రేటు సానుకూలంగా ఉందని.. మే 2న రికవరీ రేటు 78% ఉందని… అలాగే మే 3న దాదాపు 83% వరకు పెరిగిందన్నారు. ఇక ఇలాగే రికవరీల రేటు మరింత పెంచేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు.

Also Read: Vaccine Second Dose: క‌రోనా సెకండ్ డోస్ ఆల‌స్య‌మ‌వుతోంద‌ని టెన్ష‌న్ అవుతున్నారా.? ఏం ప‌ర్లేదు అంటోన్న నిపుణులు..