AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aiims Delhi: శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు ఒకపూట సెలవు ప్రకటించడంపై వెనక్కి తగ్గిన ఢిల్లీ ఎయిమ్స్..!

రామమందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సోమవారం ఒకపూట సెలవు ఇచ్చిన అంశంపై ఢిల్లీలోని ఎయిమ్స్‌ యూటర్న్‌ తీసుకుంది. ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ అపాయింట్‌మెంట్‌లకు అనుగుణంగా ఓపీ విభాగం తెరిచే ఉంచుతామని ప్రకటించింది. రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెల్పింది. ఈ మేరకు తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఒకపూట సెలవులోఅన్ని కీలక విభాగాల సేవలు..

Aiims Delhi: శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు ఒకపూట సెలవు ప్రకటించడంపై వెనక్కి తగ్గిన ఢిల్లీ ఎయిమ్స్..!
Aiims Delhi
Srilakshmi C
|

Updated on: Jan 21, 2024 | 3:38 PM

Share

ఢిల్లీ, జనవరి 21: రామమందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సోమవారం ఒకపూట సెలవు ఇచ్చిన అంశంపై ఢిల్లీలోని ఎయిమ్స్‌ యూటర్న్‌ తీసుకుంది. ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ అపాయింట్‌మెంట్‌లకు అనుగుణంగా ఓపీ విభాగం తెరిచే ఉంచుతామని ప్రకటించింది. రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెల్పింది. ఈ మేరకు తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఒకపూట సెలవులోఅన్ని కీలక విభాగాల సేవలు కూడా యథావిధిగా పనిచేస్తాయని స్పష్టం చేసింది. కాగా

అయోధ్య రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రామభక్తులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలతోపాటు, అనేక విద్యా సంస్థలు, వివిధ కార్యాలయాలు ఆ రోజున సెలవు ప్రకటించాయి. ఈ క్రమంలోనే ఢిల్లీలోని ఎయిమ్స్‌ కూడా మధ్యాహ్నం 2.30 వరకు ఒకపూట సెలవు ఇస్తున్నామని, అప్పటి వరకూ ఆస్పత్రి మూసివేస్తున్నట్లు శనివారం తన ఉత్తర్వుల్లో ప్రకటించింది. దీనిపై విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎయిమ్స్ నిర్ణయంతో ఆరోగ్య సేవలకు ఆటంకం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ శివసేన, తృణమూల్‌ కాంగ్రెస్‌ సహా పలువురు సోషల్‌ మీడియాలో పోస్టులు చేశారు.

శివసేన (యుబిటి) ఎంపీ ప్రియాంక చతుర్వేదితోపాటు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సంద‌ర్భంగా జనవరి 22న మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ త‌లెత్తేలా చేయ‌కండి. తనకు స్వాగ‌తం ప‌లికేందుకు ఆరోగ్య సేవ‌ల‌కు అంతరాయం కలిగించడాన్ని రాముడు అంగీక‌రిస్తాడాని నాకు ఆశ్చర్యం క‌లుగుతోంద‌ని ఎంపీ ప్రియాంక చతుర్వేది ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ప్రజలు అపాయింట్‌మెంట్ కోసం ఎయిమ్స్ గేట్ల వద్ద చలిలో ఆరు బయట పడిగాపులు కాస్తుంటారు. మోదీ ప్రభుత్వం కెమెరాలు, పీఆర్‌లకు ఇచ్చిన ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పేద ప్రజలు వైద్యం కోసం నిరీక్షిస్తూ చనిపోతారంటూ ఎక్స్‌లో విమర్శించారు. ఈ నేపథ్యంలోనే తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకున్న ఎయిమ్స్‌, సోమవారం అన్ని సేవలను యథావిధిగా కొనసాగిస్తున్నట్లు ప్రకటన వెలువరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..