AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goa Hotel Manager Case: భార్యను సముద్రంలో ముంచి హత్య చేసిన హోటల్ మేనేజర్‌.. ప్రమాదవశాత్తు చనిపోయిందంటూ డ్రామాలు!

లగ్జరీ హోటల్‌కు మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ పెద్దమనిషి భార్యను దారుణంగా హతమార్చాడు. మూడో కంటికి తెలియకుండా భార్యను సముద్రంలో ముంచి చేతులు దులుపుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా ప్రమాదవశాత్తు మరణించిందని కట్టకథలు అల్లాడు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడటంతో జైలు పాలయ్యాడు. ఈ షాకింగ్ ఘటన గోవాలోని పనాజీలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Goa Hotel Manager Case: భార్యను సముద్రంలో ముంచి హత్య చేసిన హోటల్ మేనేజర్‌.. ప్రమాదవశాత్తు చనిపోయిందంటూ డ్రామాలు!
Goa Hotel Manager Case
Srilakshmi C
|

Updated on: Jan 21, 2024 | 3:07 PM

Share

పనాజీ, జనవరి 21: లగ్జరీ హోటల్‌కు మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ పెద్దమనిషి భార్యను దారుణంగా హతమార్చాడు. మూడో కంటికి తెలియకుండా భార్యను సముద్రంలో ముంచి చేతులు దులుపుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా ప్రమాదవశాత్తు మరణించిందని కట్టకథలు అల్లాడు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడటంతో జైలు పాలయ్యాడు. ఈ షాకింగ్ ఘటన గోవాలోని పనాజీలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఉత్తరప్రదేశ్‌కి చెందిన గౌరవ్ కటియార్ (29) సౌత్‌ గోవాలోని ఓ హోటల్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అతడికి ఏడాది క్రితం దీక్షా గంగ్వార్‌ (27)అనే యువతితో వివాహం జరిగింది. అయితే గౌరవ్‌కు ఇతర మహిళతో వివాహేతర సంబంధం ఉంది. దీంతో గత కొద్ది కాలంగా దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. భర్తకు వివాహేతర సంబంధం ఉందని భార్య దీక్షా తరచూ ఆరోపించేది. ఈ విషయాలు బయటకు రాకుండా ఉండేందుకు భార్యను చంపాలని గౌరవ్‌ పథకం పన్నాడు. ఈక్రమంలో ఆమెను గోవాలోని కాబో డి రామ తీరానికి తీసుకెళ్లాడు. అక్కడ బీచ్‌లోని రాళ్ల ప్రాంతానికి తీసుకెళ్లి సముద్రంలో ముంచి చంపేశాడు. భార్యభర్తలిద్దరూ కలిసి శుక్రవారం మధ్యాహ్నం సమయంలో నీటిలోకి వెళ్లి, గౌరవ్‌ మాత్రమే తిరిగి రావడాన్ని అక్కడి పర్యాటకులు గమనించారు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గౌరవ్‌ మాత్రం తన భార్య ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయిందంటూ నాటకాలు ఆడాటం ప్రారంభించాడు. ఆమెను కాపాడేందుకు సర్వశక్తులా ప్రయత్నించానంటూ దొంగ కన్నీళ్లు కాడ్చాడు.

శుక్రవారం మధ్యాహ్నం బీచ్ సమీపంలో గంగ్వార్ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. గోవా బీచ్‌లో ఓ పర్యాటకుడి వీడియో ద్వారా గౌరవ్‌ బండారం బయటపడింది. భార్య చనిపోయిందని ధ్రువీకరించుకున్నాకే గౌరవ్‌ నీటి నుంచి బయటకు వచ్చినట్లు పర్యాటకుడి వీడియో క్లిప్‌ చిత్రీకరించిన వీడియోలో స్పష్టంగా కనిపించింది. దీంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నడోదు చేశారు. నిందితుడు గౌరవ్‌ను శనివారం అరెస్ట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.