AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress: కాంగ్రెస్ వర్కింగ్‌ కమిటీని ప్రకటించిన ఖర్గే.. తెలంగాణకు నుంచి..

ఇదిలా ఉంటే సీడబ్ల్యూసీలో తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత ఉంటుందని అంతా భావించినా చోటు దక్కకపోవడం గమనార్హం. తెలంగాణలో సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ ఎందుకు చోటు కల్పించలేరన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే తెలంగాణ నుంచి ములుగు ఎమ్మెల్యే సీతక్క, సంపత్, దామోదర రాజనరసింహకు ఛాన్స్ ఇస్తారని వార్తలు వచ్చాయి. అయితే దామోదర నరసింహకి శాశ్వత ఆహ్వానితులుగా ప్రకటించడం గమనార్హం...

Congress: కాంగ్రెస్ వర్కింగ్‌ కమిటీని ప్రకటించిన ఖర్గే.. తెలంగాణకు నుంచి..
Mallikarjun Kharge
Narender Vaitla
|

Updated on: Aug 20, 2023 | 2:35 PM

Share

ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీని ప్రకటించారు. 39 మందితో సీడబ్ల్యూసీని ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి రఘవీరారెడ్డికి చోటు దక్కింది. శాశ్వత ఆహ్వానితులుగా 18 మంది నేతలు, ప్రత్యేక ఆహ్వానితులుగా 13 మంది నేతలను నియమించారు,. శాశ్వత ఆహ్వానితులుగా సుబ్బరామిరెడ్డి,కొప్పుల రాజు , దామోదర్‌ రాజనర్సింహాలను ఎంపిక చేశారు. ఇక ప్రత్యేక ఆహ్వానితులుగా పల్లంరాజు,వంశీచంద్‌రెడ్డిలకు చోటు దక్కింది. ఇక కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులుగా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, ఖర్గే ,సచిన్‌ పైలట్‌ , దిగ్విజయ్‌సింగ్‌ ,శశిథరూర్‌ , అధిరంజన్‌,జితేంద్రసింగ్‌ , అశోక్‌ చవాన్‌ , దీపక్‌ బవారియాకు చోటు దక్కింది. ఇదిలా ఉంటే సీడబ్ల్యూసీలో ఏపీ నుంచి రఘువీరారెడ్డికి చోటు దక్కగా తెలంగాణ నుంచి ఎవరికి ప్రాతినిధ్యం లభించకపోవడం గమనార్హం.

ఇదిలా ఉంటే సీడబ్ల్యూసీలో తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత ఉంటుందని అంతా భావించినా చోటు దక్కకపోవడం గమనార్హం. తెలంగాణలో సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ ఎందుకు చోటు కల్పించలేరన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే తెలంగాణ నుంచి ములుగు ఎమ్మెల్యే సీతక్క, సంపత్, దామోదర రాజనరసింహకు ఛాన్స్ ఇస్తారని వార్తలు వచ్చాయి. అయితే దామోదర నరసింహకి శాశ్వత ఆహ్వానితులుగా ప్రకటించడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే అంతకు ముందు టీ కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గేను కలిశారు. ఈనెల 26న చేవెళ్లలో జరిగే బహిరంగ సభకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ అంశాలపై ఖర్గేతో నేతలు చర్చించారు. క్షేత్రస్థాయిలో సేకరించిన కొన్ని అంశాలు ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై చర్చించామని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత ఖర్గే మాట్లాడుతూ.. తెలంగాణలో దళిత, గిరిజన అభివృద్ధికి కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఢిల్లీలో మల్లిఖార్జున ఖర్గేతో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 26న చేవెళ్లలో జరిగే బహిరంగ సభలో మల్లిఖార్జున ఖర్గే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ప్రకటిస్తారని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..