AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AI: ప్రచారానికైతే ఫర్వాలేదు… ప్రతీకారానికీ ‘ఏఐ’నేనా!

ఒక్క ఫొటో వేల భావాలకు ప్రతిరూపం. మంచినీ చెప్పొచ్చు, చెడునూ చూపించొచ్చు. రాముడి లక్షణాలు చెప్పి, ఎలా ఉండేవాడో చూపమన్నప్పుడు.. ఏఐ ఇచ్చిన ఫొటోకి మతిపోయింది అందరికీ. నిజంగా అంత అందంగా ఉండేవాడేమో రాముడు అనిపించింది. అడుగు ముందుకేసి, పాత ఫొటోలతో పెళ్లి వీడియోలు చేశారు. చనిపోయిన వారు దిగొచ్చి ఆశీర్వదిస్తున్నట్టు క్రియేట్ చేశారు. అదే ఏఐతో ఇప్పుడు చెడునూ చూపిస్తున్నారు. రష్మిక, అలియా, సల్మాన్‌ఖాన్‌-ఐశ్వర్య బచ్చన్.. ఇలా ఎంతమంది బాధితులో. ఇప్పుడీ ట్రెండ్‌ రాజకీయాలకు పాకింది. ఒబామా పెడరెక్కలు విరిచి, ట్రంప్‌ ముందు మోకాళ్లపై కూర్చోబెట్టిన వీడియో చూస్తే.. నిజంగానే జరిగిందేమో అనిపిస్తుంది. అంత రియలిస్టిక్‌గా ఉంటుందా వీడియో. భారత్‌లో మరీ అలా దిగజారిపోయేంత పరిస్థితి ఉండదనుకున్నారు గానీ... పొలిటికల్‌ పార్టీలే తమ ఐటీ వింగ్‌తో ఏఐ వీడియోలను క్రియేట్‌ చేయించి రాంగ్‌ వేలో ప్రొజెక్ట్‌ చేస్తున్నాయి. ఈ మధ్య మోదీ, మోదీ తల్లి వీడియో రాజేసిన రాజకీయ చిచ్చు అంతాఇంతా కాదు. తమిళనాట డీఎంకే-టీవీకే మధ్య జరుగుతున్న ఏఐ యుద్ధాన్ని ఆల్రడీ చూస్తున్నాం. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు మాయ చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఇప్పుడే ఇంత డ్యామేజ్‌ జరుగుతుంటే.. ఇకపై జరగబోయే ప్రమాదాన్ని కనీసం ఊహించగలమా?

AI: ప్రచారానికైతే ఫర్వాలేదు...  ప్రతీకారానికీ 'ఏఐ'నేనా!
Political Misinformation
Ram Naramaneni
|

Updated on: Sep 18, 2025 | 10:12 PM

Share

ఎప్పటి పెరియార్.. ఎక్కడి విజయ్. ఈ ఇద్దరికీ సంబంధం ఉందా అసలు. ఏఐతో క్రియేట్‌ చేసి రచ్చ రేపారు. పోనీ.. దాన్నో క్రియేటివిటీగా తయారుచేసుంటే ఫర్వాలేదు. తమ పార్టీకి ఉపయోగపడే కంటెంట్‌తో రెడీ చేసుంటే అదో రకంగా ఉండేది. కాని, డీఎంకేను విమర్శించేందుకు వాడారు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ని. పైగా పెరియార్, అన్నాదురై వంటి వ్యక్తులను ఉపయోగించి.. డీఎంకేపై డిజిటల్‌ దాడికి దిగారు. స్టాలిన్‌ పార్టీని మామూలు డ్యామేజ్‌ చేయలేదా వీడియో. జనం నరనరాల్లోకి ఎక్కేసింది. వెంటనే.. డీఎంకే సైతం కౌంటర్‌ వీడియో రిలీజ్‌ చేయాల్సి వచ్చిందంటే.. విజయ్‌ ఏఐ వీడియో ఎంత డ్యామేజ్‌ చేసుంటుంది.  తలపతి విజయ్‌ ఓ ట్రైలర్‌ రిలీజ్ చేశారు. మొత్తం 2 నిమిషాల 32 సెకన్లు వీడియో అది. ట్రైలర్‌లాగే కట్‌ చేసినా.. ఆల్‌మోస్ట్‌ సినిమా చూపించేశారు అందులో. స్టాలిన్‌ సారథ్యంలోని డీఎంకే తీరు ఎలా ఉందో విమర్శిస్తూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో వీడియో రిలీజ్‌ చేశారు. తలపతి విజయ్‌ మెయిన్‌ టార్గెట్‌ డీఎంకేనే. ఎక్కడా అన్నాడీఎంకేను విమర్శిస్తున్నట్టు కనిపించడం లేదు. అటు బీజేపీ తన సైద్ధాంతిక శత్రువు అంటున్నారు గానీ ఎక్కువ ఫోకస్‌ మాత్రం స్టాలిన్‌ పార్టీ మీదే. డీఎంకే బలం తమిళవాదం. అచ్చమైన ద్రవిడవాదం. తమిళ భాష, తమిళ సంస్కృతి కోసం నిరంతరం పోరాడుతున్న పార్టీగా తనను తాను ప్రజల ముందు చూపించుకుంటుంది డీఎంకే. సో, ఆ ఓటర్లను తనవైపు తిప్పగలిగితే చాలు.. డీఎంకేను ఓడించేసినట్టే అనేది టీవీకే అధినేత...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి