Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air India: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో సైబర్‌ దాడి కోణం..? ఆపరేటింగ్‌ సిస్టమ్‌ హ్యాక్‌ చేసి..

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం 241 మంది ప్రాణాలను బలితీసుకుంది. సాంకేతిక లోపం, నిర్లక్ష్యం లేదా సైబర్ దాడి వంటి అనేక కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. విమానం టేకాఫ్ సమయంలోని వేగం, ఫ్లాప్‌ల స్థితి, ఇంజిన్ థ్రస్ట్, ల్యాండింగ్ గేర్ వంటి అంశాలు కీలకం. సైబర్ దాడి అంశం కూడా విచారణలో ఉంది.

Air India: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో సైబర్‌ దాడి కోణం..? ఆపరేటింగ్‌ సిస్టమ్‌ హ్యాక్‌ చేసి..
Air India
SN Pasha
|

Updated on: Jun 13, 2025 | 10:09 PM

Share

అహ్మదాబాద్ విమాన ప్రమాదం యావత్‌ దేశాన్ని.. కాదు కాదు మొత్తం ప్రపంచాన్ని బాధలో ముంచేసింది. ఈ ప్రమాదంలో 241 మంది విమానంలో ఉన్నవాళ్లు, అలాగే విమానం కూలిన ప్రాంతంలో ఉన్న మరికొంత మంది మరణించారు. ఈ దుర్ఘటన తర్వాత తర్వాత ఏదైనా మిగిలి ఉంటే.. అవి ప్రశ్నలు మాత్రమే. విమానం కూలిపోవడానికి సాంకేతిక లోపం కారణమా? నిర్లక్ష్యం వల్ల జరిగిందా? లేదా మన దేశంపై కుట్రతో ఎవరైనా సైబర్‌ దాడి చేసి.. విమానం కూల్చేశారా? ఈ ప్రశ్నలకు ప్రస్తుతం యావత్‌ దేశం సమాధానం తెలుసుకోవాలి అనుకుంటోంది.

భారతదేశం మాత్రమే కాదు, ఇతర దేశాలకు చెందిన అనేక సంస్థలు కూడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నాయి. విమానం ఎలా కూలిపోయిందో తెలుసుకోవడానికి అమెరికా, యూకే వంటి దేశాలు తమ ప్రత్యేక బృందాలను పంపుతున్నాయి. టేకాఫ్‌కు ముందు విమానంలో ఏదైనా సాంకేతిక లోపం ఉందా? దాన్ని పరిష్కరించలేదా? విమానం అకస్మాత్తుగా పనిచేయకపోయిందా? లేక విమానం నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందా? టేకాఫ్ సమయంలో పైలట్ ఏదైనా తప్పు చేశాడా? ఎందుకంటే ఒక నివేదిక ప్రకారం.. టేకాఫ్ సమయంలో 65 శాతం ప్రమాదాలు మానవ తప్పిదం వల్లనే జరుగుతున్నాయి. ఇందులో కుట్ర కోణం చుట్టూ కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. సైబర్ దాడి జరుగుతుందనే అనుమానాలు ఉన్నాయి.

జూన్ 12న ఎయిర్ ఇండియా విమానం AI171 అహ్మదాబాద్‌లో ఇద్దరు అనుభవజ్ఞులైన పైలట్లు నడుపుతుండగా ప్రమాదానికి గురైంది. వాతావరణం కూడా పూర్తి అనుకూలంగా ఉంది. సరిగ్గా టేకాఫ్ అవుతున్నట్లు కనిపించిన విమానం కొంచెం ఎత్తుకు చేరుకున్న తర్వాత ఎలా పడిపోయిందో తెలుసుకోవడానికి అంతా ఆసక్తిగా ఉన్నారు. ఫ్లాప్‌లను తప్పుగా అమర్చడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? ఇంజిన్‌కు తక్కువ థ్రస్ట్ పవర్ వచ్చిందా? లేదా 3505 మీటర్ల రన్‌వే నుండి సమయానికి ముందే విమానం టేకాఫ్ అయిందా? ల్యాండింగ్ గేర్ సమయానికి పైకి లేవలేదా? ఇలా బుర్రలు బద్దలైపోయే ప్రశ్నలెన్నో.

625 అడుగుల ఎత్తుకు వెళ్లిన తర్వాత విమానం అకస్మాత్తుగా ఎలా పడిపోవడం ప్రారంభించింది? టేకాఫ్ సమయంలో విమానం వేగం 174 నాట్లు అని చెబుతున్నారు. బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌కు ఈ బరువు వద్ద కనీసం 200 నుండి 250 నాట్ల వేగం అవసరం. విమానం కూలిపోయిన వీడియోలో విమానం ల్యాండింగ్ గేర్ క్రిందికి కనిపిస్తుంది, టేకాఫ్ సమయంలో ఇది ఇలా ఉండకూడదు. విమానం టేకాఫ్ అయ్యే సమయంలో దాదాపు 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉందని చెబుతున్నారు. మరి అధిక బరువు కారణంగా ఇంజిన్ తగినంత థ్రస్ట్ పొందలేదా? విమానం టేకాఫ్ కావడానికి ఏది అవసరం. ఈ రోజు దర్యాప్తు సంస్థలు విమానం బ్లాక్ బాక్స్‌ను కనుగొన్నప్పటికీ, ఇది విమాన ప్రమాదం గురించి పూర్తి సత్యాన్ని వెల్లడిస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి పాత్ర ఏమైనా ఉందా? అంటే చెప్పలేని పరిస్థితి. ఈ ఆరోపణలు కూడా కొట్టేయడానికి లేదు. సైబర్ దాడి ద్వారా విమానాన్ని కూల్చివేసే అవకాశం ఉందా? అంటే కచ్చితంగా అవును అనే సమాధానం వస్తుంది. 2025 ఏప్రిల్‌లో మయన్మార్‌లో భూకంప బాధితులకు సహాయం చేయడానికి భారతదేశం ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించినప్పుడు, ఆ తర్వాత భారత వైమానిక దళ విమానంపై సైబర్ దాడి జరిగినప్పుడు అలాంటి ఆధారాలు కనుగొన్నారు. అప్పుడు పైలట్లు బ్యాకప్ వ్యవస్థతో తమ మిషన్‌ను పూర్తి చేశారు.

అదేవిధంగా 2016 సెప్టెంబర్ 19న అట్లాంటిక్ విమానాశ్రయంలో బోయింగ్ 757 విమానం ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ అయింది. కొంతకాలం తర్వాత విమానం పూర్తిగా బాగానే ఉంది. తరువాత US హోంల్యాండ్ డిపార్ట్‌మెంట్ ఇది ఒక రిహార్సల్ అని పేర్కొంది. కానీ అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కూడా సైబర్ దాడి కోణం ఉందా? ఇది దర్యాప్తు చేయవలసిన విషయమే. ఈ కోణాన్ని కూడా తేలిగ్గా తీసుకోకుండా క్షుణ్ణంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. ఈ ప్రమాదం 269 మందిని బలితీసుకుంది. వారి కుటుంబాలను రోడ్డున పడేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..