బెంగుళూరు- చెన్నై ఎక్స్‌ప్రెస్ వే స్లో మూవర్స్‌కు నో ఎంట్రీ.. కారణమిదే
పేరుకే బెంగుళూరు- చెన్నై ఎక్స్‌ప్రెస్ వే... గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లే వాహనాలకుద్దేశించిన ఈ రోడ్ అది. అటువంటి రోడ్‌పై టూ వీలర్లు, త్రీ వీలర్లు, ట్రాక్టర్లు, ఆఖరికి ఎడ్ల బండ్లు కూడా ప్రయాణించడంతో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.

పేరుకే బెంగుళూరు- చెన్నై ఎక్స్‌ప్రెస్ వే… గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లే వాహనాలకుద్దేశించిన ఈ రోడ్ అది. అటువంటి రోడ్‌పై టూ వీలర్లు, త్రీ వీలర్లు, ట్రాక్టర్లు, ఆఖరికి ఎడ్ల బండ్లు కూడా ప్రయాణించడంతో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎన్‌హెచ్ఏఐ నిషేధం విధించినప్పటికి ఈ వాహనదారులు పట్టించుకోకపోవడంతో తీవ్రంగా పరిగణించిన కర్నాటకలోని కోలార్ జిల్లా పోలీసులు స్లోమూవింగ్ వాహనాలను ఎక్స్‌ప్రెస్ వేలోకి రాకుండా నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపడుతున్నారు. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేగా పేరుపొందిన బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే కర్నాటకలో 68 కిలోమీటర్లు మేర సాగుతోంది.
కొన్ని నెలలక్రితమే వాహనాలకు ఇక్కడ అనుమతించారు. ఈ ఎక్స్‌ప్రేస్ వేపై స్లో మూవింగ్ వాహనాలు వేగంగా వెళ్లే వాహనాలకు అడ్డు రావడంతో తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత మూడు నెలల్లో ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై 15మంది దుర్మరణం పాలయ్యారు. జూన్ 9న ఓ కారు ముందు వెళుతున్న స్లో మూవింగ్ వాహనాన్ని తప్పించుకోజూసి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో స్లో మూవింగ్ వాహనాలను నిషేధిస్తున్నట్లు కోలార్ జిల్లా పోలీసులు ప్రకటించారు.