Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఇదెక్కడి వింత ఆచారం.. 17 ఏళ్లుగా ఒక్క పెళ్లీ జరగని గ్రామం..ఎందుకంటే.?

భారత దేశం ఎన్నో సంస్కృతీ సంప్రదాయలకు నెలవు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయం, ఆచారవ్యవహారాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలవారు ఆచరించే సంప్రదాయాలు వింతగా అనిపిస్తూ.. ఆశ్చర్యం కలిగిస్తాయి. టెక్నాలజీ యుగంలోనూ అలాంటి ఓ వింత ఆచారం మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామంలో ఇప్పటికీ అమలులో ఉంది.

Viral: ఇదెక్కడి వింత ఆచారం.. 17 ఏళ్లుగా ఒక్క పెళ్లీ జరగని గ్రామం..ఎందుకంటే.?
Marriage
Ravi Kiran
|

Updated on: Jun 13, 2025 | 9:41 PM

Share

భారత దేశం ఎన్నో సంస్కృతీ సంప్రదాయలకు నెలవు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయం, ఆచారవ్యవహారాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలవారు ఆచరించే సంప్రదాయాలు వింతగా అనిపిస్తూ.. ఆశ్చర్యం కలిగిస్తాయి. టెక్నాలజీ యుగంలోనూ అలాంటి ఓ వింత ఆచారం మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామంలో ఇప్పటికీ అమలులో ఉంది. అదే పరాగ్‌ అనే సంప్రదాయం. దీని కారణంగానే ఈ గ్రామంలో 17 ఏళ్లుగా ఒక్క వివాహం కూడా జరగలేదు. ఏంటీ సంప్రదాయం.. ఎందుకు దీనిని వారు ఆచరిస్తున్నారు అంటే దీని వెనుక చాలా పెద్ద కారణమే ఉంది.

మధ్యప్రదేశ్‌ బుందేల్‌ఖండ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో పరాగ్‌ సంప్రదాయం కొన్ని శతాబ్దాలుగా అమలులో ఉంది. ఈ ఆచారం ప్రకారం- గ్రామంలో ఎవరైనా హత్య, గోవధ వంటి నేరాలకు పాల్పడితే మొత్తం గ్రామంలో వివాహాలు ఆగిపోతాయి. ఇక్కడి చాలా గ్రామాల్లో ఎక్కువగా ఈ సంప్రదాయం పాటిస్తున్నారు. ఇందులోని పలు గ్రామాల్లో పెళ్లి బాజాలు మోగి చాలా కాలమవుతోంది. అంతమాత్రాన ఆ గ్రామాల ప్రజలు వివాహాలు చేసుకోవడం మానేయలేదు. వారి గ్రామంలో కాకుండా ఊరు బయట వారు పెళ్లిళ్లు చేసుకునేవారు. అయితే, గ్రామం వెలుపల పెళ్లి చేసే స్థోమత లేని పేదలకు ఇది చాలా ఇబ్బందికరంగా మారింది. నేరం చేసిన వ్యక్తి లేదా అతని కుటుంబ సభ్యులు తీర్థయాత్రకు వెళ్లాలి. తీర్థయాత్ర తర్వాత తులసి- శాలిగ్రామ్ వివాహం జరిపించాలి. ఆ తర్వాత విందు ఏర్పాటు చేయాలి. అప్పుడు పరాగ్ సంప్రదాయం తొలగి, గ్రామంలో వివాహాలు చేసుకోవచ్చు. చాలామంది సంపన్నులు ఈ సంప్రదాయాన్ని త్వరగా వదిలించుకుంటారు. కానీ పేదప్రజలు తీర్థయాత్ర, తులసి వివాహం, సామూహిక విందు వంటి ఖరీదైన పనులను చేయలేరు.

ఈ నేపథ్యంలో లాలోయి గ్రామంలో గత 17ఏళ్లుగా పెళ్లి బాజాలు మోగలేదు. ఓ హత్య కారణంగా పరాగ్‌ సంప్రదాయానికి కట్టుబడి ఉండటంతో ఇన్నేళ్లూ ఆ గ్రామంలో పెళ్లి బాజాలు మోగలేదు. పరాగ్ సంప్రదాయాన్ని ఎలా వదిలించుకోవాలో అని గ్రామస్థులు ఆందోళన చెందారు. తాజాగా సర్పంచ్ బాదల్ సింగ్, గ్రామ ప్రజలు ఏకమై ఈ సంప్రదాయానికి తెర దించుతూ.. పక్క ఊరిలో ఉన్న ఓ గిరిజన యువతి వివాహాన్ని లాలోయి గ్రామంలో చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో బాజాలతో పెళ్లి కూతురును ఊరేగింపుగా లాలోయి గ్రామానికి తీసుకొచ్చారు. దీంతో 17 ఏళ్ల తర్వాత ఈ గ్రామంలో పెళ్లి బాజాలు మోగాయి. గ్రామస్థులందరూ ఊరేగింపునకు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత వైభవంగా పెళ్లి జరిగింది. ఈ పెళ్లి వేడుకలో స్థానిక ఎమ్మెల్యే, మాజీ హోం మంత్రి భూపేంద్ర సింగ్ పాల్గొన్నారు.