AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టుల దాడిపై కేంద్రం సీరియస్.. మావోలను ఉక్కుపాదంతో అణచివేస్తామని అమిత్‌షా హెచ్చరిక

చత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టుల దాడిపై కేంద్రం సీరియస్‌ అయ్యింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో మావోయిస్టులకు....

చత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టుల దాడిపై కేంద్రం సీరియస్.. మావోలను ఉక్కుపాదంతో అణచివేస్తామని అమిత్‌షా హెచ్చరిక
Amit Shah
Ram Naramaneni
|

Updated on: Apr 04, 2021 | 8:30 PM

Share

చత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టుల దాడిపై కేంద్రం సీరియస్‌ అయ్యింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో మావోయిస్టులకు గట్టి గుణపాఠం చెప్పాలని నిర్ణయించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి , ఐబీ చీఫ్‌తో పాటు సీఆర్‌పీఎఫ్‌ డీజీ ఈ సమావేశానికి హాజరయ్యారు. అసోంలో ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్న అమిత్‌షా హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు. మావోయిస్టుల దాడిని తీవ్రంగా ఖండించారు. జవాన్ల ప్రాణత్యాగం వృధా కాదన్నారు. తప్పకుండా మావోయిస్టులను ఉక్కుపాదంతో అణచివేస్తామని ప్రకటించారు అమిత్‌షా. ఈ దాడికి మావోయిస్టు అగ్రనేత హిడ్మా స్కెచ్‌ గీసినట్టు అనుమానిస్తున్నారు. ఈ దాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ విచారణకు ఆదేశించే అవకాశాలున్నాయి.

పక్కా ప్లాన్‌ తోనే బీజాపూర్‌లో మావోయిస్టులు దాడి చేసినట్టు గుర్తించారు. కూంబింగ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్న భద్రతా బలగాలను ప్లాన్‌ ప్రకారం తాము అనుకున్న ప్రదేశానికి రాగానే…మావోయిస్టులు యు ఆకారంలో మాటు వేసి దాడి చేశారు. దాడిలో 400 మందికిపైగా మావోయిస్టులు పాల్గొన్నట్లు గుర్తించారు. 100 నుంచి 200 మీటర్ల దూరం నుంచి మావోయిస్టులు కాల్పులు జరపడంతో జవాన్లు తప్పించుకోలేకపోయారు. ఒకేసారి ఐఈడీలు, రాకెట్‌ లాంచర్లు, ఏకే 47తో మెరుపు దాడి చేశారు.

మావోయిస్టుల దాడిలో 22 మంది జవాన్లు చనిపోయారని , ఓ జవాన్‌ గల్లంతయ్యారని బస్తర్‌ ఐజీ సుందర్‌రాజ్‌ తెలిపారు. ఆ ప్రాంతంలో కూంబింగ్‌ కొనసాగుతోందని వెల్లడించారు. కావాలనే మావోయిస్టు కమాండర్‌ హిడ్మా ఆ ప్రాంతంలో ఉన్నట్టు సమాచారాన్ని లీక్‌ చేసినట్టు అనుమానిస్తున్నారు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా కోసం వెళ్లి భద్రతా బలగాలు ట్రాప్‌లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. గతంలో ఎన్నో దాడులకు సూత్రధారిగా వ్యవహరించిన హిడ్మానే తాజా దాడికి ప్లాన్‌ వేసినట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేతకు CRPF, కోబ్రా, DRGలకు చెందిన దాదాపు 2 వేల మంది భద్రతా బలగాలు గాలింపు నిర్వహిస్తున్నాయి. ఐదు ప్రాంతాల నుంచి ఒకేసారి శనివారం ఆపరేషన్‌ చేపట్టారు. ఈ క్రమంలో తరెం ఏరియాలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న 400 మంది భద్రతా బలగాలపై మావోయిస్టు మిలటరీ పుటూన్‌ దళాలు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాయి. వెంటనే భద్రతాబలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దర మావోయిస్టులు మృతిచెందారు. ఎదురుకాల్పుల్లో 31 మంది జవాన్లు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 23మందిని జగ్‌దల్‌పూర్‌, మరో ఏడుగురిని రాయ్‌పూర్‌ ఆసుపత్రికి తరలించారు. చత్తీస్‌గఢ్‌లో గత పదిరోజుల్లో రెండో అతిపెద్ద ఎన్‌కౌంటర్‌ ఇది. మార్చి 23న బస్సును మావోయిస్టులు పేల్చివేశారు. ఈ ఘటనలో ఐదుగురు DRG సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read: ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. అదే సమయంలో ఓపెన్ హార్ట్ సర్జరీ.. డాక్టర్లు ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు

నక్కి మరీ ఎలుకపై అటాక్ చేసిన పాము.. మూషికం వెనక కాళ్లతో తన్నితే స్నేక్ దిమ్మతిరిగింది