Coal – Electricity Crisis: బొగ్గు నిల్వలు, విద్యుత్ సంక్షోభంపై కేంద్రం అప్రమత్తం.. నేడు పీఎంఓ కార్యాలయం సమీక్ష..
Coal Crisis - Electricity problem in india: దేశంలోని అనేక విద్యుత్ కంపెనీలలో బొగ్గు నిల్వలు తగ్గిపోయాయి. దీంతో దేశంలోని అనేక రాష్ట్రాలలో తీవ్ర విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. మున్ముందు
Coal Crisis – Electricity problem in india: దేశంలోని అనేక విద్యుత్ కంపెనీలలో బొగ్గు నిల్వలు తగ్గిపోయాయి. దీంతో దేశంలోని అనేక రాష్ట్రాలలో తీవ్ర విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. మున్ముందు కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో కారు చీకట్లు అలుముకోనున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. ముందుగా దక్షిణ భారతదేశంలోని బెంగళూరు పట్టణంలో అంధకారం నెలకొంటుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దేశంలో విద్యుత్ సంక్షోభం, బోగ్గు నిల్వల కొరతపై దృష్టిసారించింది. బొగ్గు నిల్వల కొరత, విద్యుత్ అంతరాయాల నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర అప్రమత్తమై.. అధికారులు, బొగ్గు కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ మేరకు హోంమంత్రి అమిత్ షా.. ఇప్పటికే కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కె సింగ్, బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో దేశంలో బొగ్గు నిల్వలు, విద్యుత్ సరఫరాపై ప్రధాన మంత్రి కార్యాలయం మంగళవారం సమీక్ష జరపనుంది. దేశంలో బొగ్గు నిల్వల కొరత, విద్యుత్ అంతరాయాల నేపథ్యంలో ఈ సమీక్షపై ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే.. బొగ్గు కొరత కారణంగా దేశంలోని పలు ప్లాంట్లల్లో విద్యుత్ ఉత్పత్తిలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో పలు రాష్ర్టాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. రాష్ట్రాల్లో దిగజారుతున్న పరిస్థితుస్థిలపై ఢిల్లీ, పంజాబ్, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు కేంద్రానికి లేఖలు కూడా రాశాయి. దీంతోపాటు విద్యుత్‌ను జాగ్రత్తగా వాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాయి.
అక్టోబర్ 7 న కేంద్ర విద్యుత్ అథారిటీ నివేదిక ప్రకారం, దేశంలోని 135 ప్లాంట్లలో 110 కర్మాగారాలు బొగ్గు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అలాగే 16 ప్లాంట్లలో ఒక్క రోజుకు సరిపడా కూడా బొగ్గు నిల్వ లేదని సమచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే బొగ్గు సరఫరాను పెంచినట్లు కోల్ ఇండియా ప్రకటనను విడుదల చేసింది. దసరా అనంతరం బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచుతామని ప్రకటించింది.
Also Read: