AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్‌కు సన్ స్ట్రోక్.. అరెస్టు కంటే ఆ కారణంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్న బాలీవుడ్ బాద్షా..

Shah Rukh Khan: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టై జైల్లో ఉండటం తెలిసిందే. ఆర్యన్ ఖాన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ కోర్టు విచారణలో ఉంది.

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్‌కు సన్ స్ట్రోక్.. అరెస్టు కంటే ఆ కారణంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్న బాలీవుడ్ బాద్షా..
Aaryan Khan Arrest
Janardhan Veluru
|

Updated on: Oct 12, 2021 | 11:50 AM

Share

Mumbai Drugs Racket Case: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టై జైల్లో ఉండటం తెలిసిందే. ఆర్యన్ ఖాన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ కోర్టు విచారణలో ఉంది. క్లిష్ట సమయంలో షారుఖ్ ఖాన్‌కు సల్మాన్ ఖాన్‌, హృతిక్ రోషన్‌తో పాలు మరికొందరు బాలీవుడ్ ప్రముఖులు బాసటగా నిలిచారు. అయితే ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు మౌనంగా ఉంటున్నారు. ఆర్యన్ ఖాన్ అరెస్టుకు రాజకీయ కారణాలు ఉన్నాయా? షారుఖ్ ఖాన్ తనయుడు అయినందునే ఆర్యన్ ఖాన్‌ను టార్గెట్ చేశారా? అని కొందరు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. అయితే ఈ ప్రశ్నలకు ఇప్పటికిప్పుడు సమాధానాలు దొరికే అవకాశం లేదు.

ఆర్యన్ ఖాన్‌ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం షారుఖ్ ఖాన్ ఇమేజ్‌ను దెబ్బతీసింది. డ్రగ్ కేసులో జైలు పాలైన ఆర్యన్.. ఓ రకంగా తన తండ్రి షారుఖ్ కు కంటి మీద కునుకు లేకుండా చేశారు.  ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు కారణంగా షారుఖ్ బ్రాండ్ వ్యాల్యు కూడా పడిపోయింది. సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యతిరేకత రావడంతో బైజూస్ బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి షారుఖ్‌ను తప్పించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో షారుఖ్ సినిమా ప్రాజెక్టులు ఆలస్యమయ్యే అవకాశముంది. దీపిక పదుకొనెతో కలిసి చేస్తున్న సినిమా కోసం షారుఖ్ ఖాన్ త్వరలోనే స్పెయిన్‌కి వెళ్లాల్సి ఉంది. అయితే ఈ షెడ్యూల్‌ను షారుఖ్ ఖాన్ వాయిదావేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే నయనతార సరసన షారుఖ్ చేస్తున్న అట్లీ మూవీపై కూడా దీని ప్రభావం ఉండొచ్చని సమాచారం. మరిన్ని ప్రాజెక్టులు కూడా షారుఖ్ చేజారే అవకాశమన్నట్లు తెలుస్తోంది. ఓ రకంగా ఆర్యన్ ఖాన్ దెబ్బకు షారుఖ్ ఖాన్ ఇమేజ్ పడిపోవడంతో.. యాడ్స్, సినిమా అవకాశాలు తగ్గడంతో పాటు రెమ్యునరేషన్‌పై కూడా ఇది ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

తన సొంత ఇమేజ్ కంటే ఆర్యన్ కెరీర్‌పై షారుఖ్‌ ఎక్కువ కలత చెందుతున్నట్లు తెలుస్తోంది. ఆర్యన్ ఖాన్‌ను త్వరలోనే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇప్పించేందుకు షారుఖ్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసులో ఆర్యన్ అరెస్టు కావడంతో షారుఖ్ ప్లాన్స్ తలకిందులయ్యాయి. దీంతో ఆర్యన్ కెరీర్ పరంగా షారుఖ్ ఎటూ తేల్చుకోలేక తీవ్ర మదనపడుతున్నట్లు తెలుస్తోంది. ఓ రకంగా తనయుడు ఆర్యన్ అరెస్టు కంటే.. అతని భవిష్యత్తు, కెరీర్‌పై ఆలోచనలే షారుఖ్‌ను ఎక్కువ ఇబ్బందిపెడుతున్నాయి.

ఆర్యన్‌‌కు త్వరలోనే కోర్టులో బెయిల్ లభిస్తుందని షారుఖ్ ఖాన్ కుటుంబీకులు ఆశిస్తున్నారు. ఆర్యన్ జైలు నుంచి విడుదలయ్యాక షారుఖ్ ఈ వ్యవహారంపై ఓ ప్రకటనల విడుదల చేసే అవకాశముందని సమాచారం. డ్రగ్స్ కేసు వ్యవహారం నేపథ్యంలో  ఆర్యన్ ఖాన్ కొంతకాలం అమెరికా లేదా బ్రిటన్‌లో నివసించే అవకాశముందని కూడా బాలీవుడ్ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆర్యన్ ఖాన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విషయంలో కోర్టు షరతులకు లోబడి షారుఖ్ ఫ్యామిలీ నిర్ణయం తీసుకునే అవకాశముంది. మొత్తానికి ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ ఎపిసోడ్ దెబ్బకు ఆయన తండ్రి షారుఖ్ ప్రతిష్ట మసకబారడం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారుతున్నాయి.

Also Read..

Mahesh Koneru: టాలీవుడ్ చిత్రపరిశ్రమలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నిర్మాత మహేష్ కోనేరు మృతి..

Kohli Argument With Umpire: అంపైర్‌‌పై విరుచుకపడ్డ కోహ్లీ.. తప్పుడు నిర్ణయాలపై ఆటగాళ్లతో కలిసి ఆటపట్టించిన ఆర్‌సీబీ కెప్టెన్