Maoists Encounter: ఆంధ్రా-ఒడిశా బోర్డర్ తుపాకీ మోతతో మరోసారి ఉలిక్కిపడింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల హతమయ్యారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం మల్కన్ గిరిజిల్లా తులసిపహాడ్ అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం కూంబింగ్ నిర్వహిస్తుండగా.. భద్రతాబలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతోపాటు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో పోలీసులకు గాయాలైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. అనంతరం పోలీసు బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గు మావోయిస్టులు మరణించారని ఒడిశా డీజీపీ ప్రకటించారు. మరణించిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నట్లు పేర్కొన్నారు.
మృతి చెందిన మావోయిస్టు ఏఓడీ ఎస్‌జెడ్‌సీ మల్కన్ గిరి – కోరాపుట్- విశాఖ బోర్డర్ డివిజన్ సభ్యురాలుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనలో ఎస్ఒజీ జవాన్‌కు గాయాలు కావడంతో హెలికాప్టర్‌లో తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఇంకా అటవీ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోందని సమాచారం. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: