AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

African Swine Fever: కొత్త టెన్ష‌న్.. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్… 4,832 పందులు మృతి

మిజోరంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కొత్త టెన్ష‌న్ క్రియేట్ చేస్తుంది. పందుల్లో ఈ వ్యాధి వ్యాప్తి క‌ల‌క‌లం రేపుతుంది. మార్చి 21 నుంచి మే 31 మధ్య..

African Swine Fever: కొత్త టెన్ష‌న్..  ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్... 4,832 పందులు మృతి
African Swine Fever
Ram Naramaneni
|

Updated on: Jun 01, 2021 | 2:25 PM

Share

మిజోరంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కొత్త టెన్ష‌న్ క్రియేట్ చేస్తుంది. పందుల్లో ఈ వ్యాధి వ్యాప్తి క‌ల‌క‌లం రేపుతుంది. మార్చి 21 నుంచి మే 31 మధ్య.. అంటే కేవ‌లం రెండు నెల‌ల 10 రోజుల‌ స‌మ‌యంలోనే మిజోరంలో 4,832 పందులు స్వైన్ ఫీవర్ బారిన పడి చ‌నిపోయాయ‌ని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ తెలిపింది. మే 31న ఒక్కరోజే 81 పందులు చనిపోయాయని వివ‌రించింది. అధికారులు చెబుతోన్న లెక్క‌ల ప్ర‌కారం.. ఇప్పటివరకు మిజోరంలోని ఎనిమిది జిల్లాల్లో స్వైన్​ ఫీవర్ కేసులు వెలుగుచూశాయి. లంగ్​సెన్ జిల్లాలో మార్చి 25న ఫ‌స్ట్ కేసు గుర్తించారు. అనంతరం అన్ని జిల్లాల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ మోహరించారు. లంగ్​సెన్​ను ఇన్​ఫెక్టెడ్ జోన్​గా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అనౌన్స్ చేసింది. ఆ జిల్లాలోని 26 గ్రామాల్లో ఈ కేసులు న‌మోద‌య్యాయి. ఈ ప్రాంతాల్లో మొత్తం 31,108 పందులు ఉన్నాయని స‌మాచారం.

ఇన్​ఫెక్టెడ్ జోన్ వెలుపల 100 పందులు అనుమానాస్పద రీతిలో మరణించినట్లు తెలిసిందని గ‌వ‌ర్న‌మెంట్ తెలిపింది. పక్క రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పందుల వల్ల స్వైన్ ఫీవర్ వ్యాపించి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆఫ్రికన్ స్వైన్​ ఫీవర్ అత్యంత ప్రమాదకరమైన డిసీజ్. దీని ద్వారా పందులు అధిక సంఖ్యలో మరణిస్తున్నాయి. ఈ వ్యాధి పందుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధికి ఇప్పటివరకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు.

Also Read:  అక్క‌డ ఉంది జ‌క్క‌న్న‌.. తగ్గేదే లే.. ప్ర‌మోష‌న్‌లో కూడా త‌న మార్క్

‘సిక్స్ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ’… చాలానే సాధించింది.. అంత‌కంటే ఎక్కువే పోగొట్టుకుంది

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?