AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aditya-L1 Spacecraft: అంతరిక్షంలోని ‘మూడో కన్ను’ ఆదిత్య-ఎల్1.. మానవాళికి ముప్పు తప్పేందుకు సూర్యుడి శక్తిపై నిఘా పెట్టనున్న ఇస్రో..

సౌర వ్యవస్థలో సూర్యుడు మనకు అత్యంత సమీప నక్షత్రం. సూర్యుని అధ్యయనం అంతరిక్షంలోని వివిధ భాగాలలో ఉన్న ఇతర నక్షత్రాల కంటే మెరుగైన రీతిలో చేయవచ్చు. ఇస్రో మన సూర్యుడిని అధ్యయనం చేస్తే .. అది పాలపుంతతో పాటు ఇతర గెలాక్సీల్లో ఉన్న నక్షత్రాలను బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. సూర్యుని నుండి భారీగా శక్తి వెలువడుతూ ఉంటుంది.

Aditya-L1 Spacecraft: అంతరిక్షంలోని 'మూడో కన్ను' ఆదిత్య-ఎల్1.. మానవాళికి ముప్పు తప్పేందుకు సూర్యుడి శక్తిపై నిఘా పెట్టనున్న ఇస్రో..
Aditya L1 Spacecraft
Surya Kala
|

Updated on: Aug 29, 2023 | 11:04 AM

Share

చంద్రయాన్-3 మిషన్ తో సక్సెస్ ఫుల్ గా చంద్రుడిపై అడుగు పెట్టిన ఇస్రో.. అక్కడ జెండాను ఎగురవేసిన ఇస్రో..  ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి సూర్యుడిపైకి మిషన్‌ను పంపబోతోంది. ఆదిత్య-ఎల్1 అంతరిక్ష నౌకను సెప్టెంబర్ 2న ప్రయోగించనున్నట్లు ఇస్రో సోమవారం ప్రకటించింది. ఆదిత్య-ఎల్1 అంతరిక్ష నౌక ద్వారా సూర్యుని అధ్యయనం చేయనున్నారు. సూర్యుడిలో జరిగే ప్రతి మార్పును ఇస్రో తన ‘మూడో కన్ను’ ద్వారా నమోదు చేస్తుంది. ఇప్పటి వరకు ఇస్రో అంతరిక్షంలో ఒక్క అబ్జర్వేటరీని కూడా ఏర్పాటు చేయలేదు. ఆదిత్య-ఎల్1 భారతదేశపు మొదటి అంతరిక్ష అబ్జర్వేటరీ అవుతుంది.

సూర్యుడు.. భూమి మధ్య దూరం 150 మిలియన్ కిలోమీటర్లు. అయితే ఆదిత్య వ్యోమనౌక సూర్యునికి దగ్గరగా పంపిచరు.. ఈ ఆదిత్య-ఎల్1 అంతరిక్ష నౌక భూమికి దగ్గరగా అంటే 15 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉండనుంది. అయితే సూర్యుడికి దగ్గరగా పంపించకుండా ఇస్రో హఠాత్తుగా సూర్యుడి గురించి తెలుసుకోవడం కోసం ఎందుకు అంతగా ఆసక్తి కనబరుస్తుందన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. దీనికి ఇస్రో చెబుతున్న సమాధానం ఏమిటో తెలుసుకుందాం..

సూర్యుడిని అధ్యయనం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే?

సౌర వ్యవస్థలో సూర్యుడు మనకు అత్యంత సమీప నక్షత్రం. సూర్యుని అధ్యయనం అంతరిక్షంలోని వివిధ భాగాలలో ఉన్న ఇతర నక్షత్రాల కంటే మెరుగైన రీతిలో చేయవచ్చు. ఇస్రో మన సూర్యుడిని అధ్యయనం చేస్తే .. అది పాలపుంతతో పాటు ఇతర గెలాక్సీల్లో ఉన్న నక్షత్రాలను బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

సూర్యుని నుండి భారీగా శక్తి వెలువడుతూ ఉంటుంది. సూర్యుని నుండి వెలువడే సౌర శక్తి, కరోనల్ మాస్ ఎజెక్షన్, సౌర గాలులు, సౌర శక్తి కణాలు భూమికి ప్రమాదకరమైనవి. సూర్యునిలో జరిగే ఈ కార్యకలాపాలకు భూమి బాధితురాలైతే.. అనేక రకాల అవాంతరాలు సంభవించవచ్చు.

అంతరిక్షంలో సూర్యునిలో మార్పుల కారణంగా అంతరిక్ష నౌక,  కమ్యూనికేషన్ వ్యవస్థలు సులభంగా బాధితులుగా మారతాయి. ఉపగ్రహాలు దెబ్బతింటాయి. దీని కారణంగా GPS నిలిచిపోవడం సర్వ సాధారణంగా మారుతుంది. సౌర పవనాలు, కరోనల్ మాస్ ఎజెక్షన్ వంటి సౌర కార్యకలాపాలు వ్యోమగాములకు ప్రాణాంతకంగా మారతాయి. సూర్యుడి నుంచి వెలువడుతున్న వివిధ ఉష్ణ, అయస్కాంత దృగ్విషయాలు చాలా ప్రమాదకరమైనవి. ఈ కారణాల వల్ల, సూర్యుని ఈ కార్యకలాపాలపై ఒక కన్నేసి ఉంచడం చాలా ముఖ్యం అని ఇస్రో విశ్వసిస్తుంది. తద్వారా అవసరమైతే సరైన చర్యలు తీసుకోవచ్చని ఇస్రో భావిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..