కేరళలో వరకట్న బాధితురాలు విస్మయ సూసైడ్ కేసు.. భర్తపై వేటు.. ఉద్యోగం నుంచి తొలగించిన ప్రభుత్వం..
కేరళలో విస్మయ నాయర్ డౌరీ డెత్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. అదనపు కట్నం కోసం తనను తన భర్త, అత్త మామలు హింసిస్తున్నారంటూ విస్మయ గత జూన్ లో ఆత్మహత్య చేసుకుంది.
కేరళలో విస్మయ నాయర్ డౌరీ డెత్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. అదనపు కట్నం కోసం తనను తన భర్త, అత్త మామలు హింసిస్తున్నారంటూ విస్మయ గత జూన్ లో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన ప్రభుత్వం ఆమె భర్త కిరణ్ కుమార్ ని ఉద్యోగం నుంచి తొలగించింది. మోటార్ వెహికల్ శాఖలో ఇతడు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ గా కొంతకాలంగా పని చేస్తున్నాడు. విస్మయ మృతిపై 45 రోజుల్లోగా దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని సంబంధిత కమిటీని కోరామని, ఆ కమిటీ సిఫారసు మేరకు కిరణ్ కుమార్ ని జాబ్ నుంచి తొలగించామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఆంటోనీ రాజు తెలిపారు. ఈ ఘటనలో పలువురు సాక్షుల వాంగ్మూలాలను పోలీసులు సేకరించారని ఆయన చెప్పారు. ఆయుర్వేద మెడికల్ స్టూడెంట్ అయిన విస్మయ గత జూన్ 24 న సూసైడ్ చేసుకుంది.
తన భర్త, అత్త మామలు తనను ఎలా హింసిస్తున్నారో ఆమె తన వాట్సాప్ ద్వారా వివరించింది. తన లాంటి స్థితి మరో యువతికి రాకూడదని పేర్కొంది. 2020 జూన్ లో ఈమె వివాహం జరిగింది. అయితే పెళ్లయిన నాటి నుంచే అదనపు కట్నం కోసం వీరు తనను టార్చర్ పెడుతూ వచ్చారని ఆమె పేర్కొంది. ఈమె సూసైడ్ తో కదిలిన రాష్ట్ర ప్రభుత్వం.. అదనపు కట్నం కోసం వేధించేవారిపై కేసులు పెట్టాలంటూ కొత్త నిబంధనలను తెచ్చింది. సీఎం పినరయి విజయన్ స్వయంగా విస్మయ మృతిని ఖండించారు. కేరళ గవర్నర్ కూడా వరకట్న దురాచారాన్ని నిరసిస్తూ రాజ్ భవన్ లో ఒక రోజు నిరాహార దీక్ష చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Snake Bite: కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కిన గీత కార్మికుడు.. పాము కాటేయడంతో గాల్లో కలిసిపోయిన ప్రాణాలు