లడాఖ్ తూర్పు ప్రాంతంలో మళ్ళీ శాంతి.. తాత్కాలిక కట్టడాలను కూల్చివేసిన చైనా

లడాఖ్ తూర్పు ప్రాంతంలో క్రమంగా శాంతి నెలకొంటోంది. ప్రధానంగా గోగ్రా హైట్స్ లోని తమ తాత్కాలిక కట్టడాలను చైనా కూల్చివేసింది. అక్కడి నుంచి తమ బలగాలను ఉపసంహరించడం ప్రారంభించింది.

లడాఖ్ తూర్పు ప్రాంతంలో మళ్ళీ  శాంతి.. తాత్కాలిక కట్టడాలను కూల్చివేసిన చైనా
Eastern Ladakh
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Aug 07, 2021 | 10:42 AM

లడాఖ్ తూర్పు ప్రాంతంలో క్రమంగా శాంతి నెలకొంటోంది. ప్రధానంగా గోగ్రా హైట్స్ లోని తమ తాత్కాలిక కట్టడాలను చైనా కూల్చివేసింది. అక్కడి నుంచి తమ బలగాలను ఉపసంహరించడం ప్రారంభించింది. అలాగే ఇండియాకూడా ఇదేవిధమైన చర్య తీసుకున్నట్టు ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. గత వారం మెల్డో పాయింట్ వద్ద ఉభయ దేశాల 12 వ కోర్స్ కమాండర్ స్థాయి అధికారుల మధ్య జరిగిన చర్చల అనంతరం తామీ చర్య తీసుకున్నట్టు ఆయన చెప్పారు. ఏడాదికి పైగా ఈ పాయింట్ వద్ద రెండు దేశాల మధ్య స్వల్ప స్థాయిలో ఉద్రిక్తత నెలకొంటూ వచ్చింది. పరస్పర విభేదాలకు ఇది మూల కారణమైంది. ఇక్కడ చైనా పక్కాగా తాత్కాలిక కట్టడాలను నిర్మించింది. ఈ కట్టడాల్లో తమ దేశ సైనికులు ఆవాసం ఉండేలా ఇవి ఉన్నాయని శాటిలైట్ ఇమేజీలు చూపాయి.దీనిపై ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది…వీటిని తొలగించాలని, అదనంగా మోహరించిన బలగాలను వెనక్కి తీసుకోవాలని కోరింది.

కాగా-ఈ నెల 4.5 తేదీల్లో చాలావరకు రెండు దేశాల సైనికులు తిరిగి తమతమ స్థావరాలకు చేరుకున్నారని, కానీ దశలవారీగా మరి కొన్ని చర్యలు చేపట్టాల్సి ఉందని భారతీయ సైనికాధికారులు తెలిపారు. గాల్వన్, గోగ్రా, పాంగంగ్ సో ప్రాంతాల్లో ఉపసంహరణలు జరిగినట్టు వారు పేర్కొన్నారు. అటు లోగడ గాల్వన్ లోయ వద్ద ఉభయ దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించిన వీడియో మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాటి ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఆ ఘర్షణల్లో చైనా సైనికులు 40 మందికి పైగా మృతి చెందినప్పటికీ ఆ దేశం దీన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు.

మరిన్ని ఇక్కడ చూడండి: ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వ మీడియా హెడ్ ను కాల్చి చంపిన తాలిబన్లు.. మరిన్ని దాడులు తప్పవని హెచ్చరిక..

Golfer Aditi Ashok: తుదివరకూ పోరాడి ఓడిన అదితి.. టోక్యో ఒలింపిక్స్‌లో చరిత్రసృష్టించే ఛాన్స్‌ మిస్