AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Updates: 6 లక్షల ఆధార్ కార్డులను రద్దు చేసిన UIDAI.. మీ కార్డు ఉందేమో చూసుకోండి..!

Aadhaar Updates: దేశ వ్యాప్తంగా సుమారు 6 లక్షల ఆధార్ కార్డు నెంబర్లు రద్దు అయ్యాయి. వీటిని రద్దు చేసిన UIDAI.. సంబంధిత నివేదికను కేంద్ర ప్రభుత్వానికి..

Aadhaar Updates: 6 లక్షల ఆధార్ కార్డులను రద్దు చేసిన UIDAI.. మీ కార్డు ఉందేమో చూసుకోండి..!
Aadhaar 2
Shiva Prajapati
|

Updated on: Jul 26, 2022 | 9:24 AM

Share

Aadhaar Updates: దేశ వ్యాప్తంగా సుమారు 6 లక్షల ఆధార్ కార్డు నెంబర్లు రద్దు అయ్యాయి. వీటిని రద్దు చేసిన UIDAI.. సంబంధిత నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. అయితే, రద్దు చేసిన ఆధార్ నెంబర్లన్నీ నకిలీవని ఆధార్ కార్డ్ జారీ అథారిటీ(Unique Identification Authority of India) తెలిపింది. ఈ విషయాన్ని పార్లమెంట్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపాు. నకిలీ ఆధార్ కార్డులతో దుండగులు పెద్ద ఎత్తున నేరాలకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే భారీ సంఖ్యలో ఆధార్ నంబర్లను రద్దు చేసినట్లు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా, నకిలీ ఆధార్ కార్డులను గుర్తించి వాటిని రద్దు చేయడం UIDAI బాధ్యత అని పేర్కొన్నారు.

లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు స్పందించిన మంత్రి.. నకిలీ ఆధార్ కార్డులను నియంత్రించేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. నకిలీ ఆధార్ వినియోగాన్ని అరికట్టడానికి ఫేస్ అథెంటికేషన్ వంటి కొత్త ఫీచర్లు కూడా తీసుకురావడం జరిగిందన్నారు. దీని వల్లే 5,98,999 నకిలీ ఆధార్ కార్డులను గుర్తించి, వాటిని రద్దు చేయడం జరిగిందన్నారు.

మీ ఆధార్ నకిలీదో కాదో తెలుసుకోవడం ఎలా? 1. ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి.(https://resident.uidai.gov.in/offlineaadhaar)

2. ఆ తర్వాత ‘ఆధార్ వెరిఫై’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

3. మీ ఆధార్‌ని ధృవీకరించడానికి నేరుగా ఈ లింక్‌కి కూడా వెళ్లొచ్చు.(https://myaadhaar.uidai.gov.in/verifyAadhaar)

4. 12 అంకెల ఆధార్ నంబర్ లేదా 16 అంకెల వర్చువల్ IDని ఎంటర్ చేయాలి.

5. నంబర్ ఎంటర్ చేసిన తర్వాత స్క్రీన్‌పై కనిపించే సెక్యూరిటీ కోడ్ నంబర్‌ను ఎంటర్ చేసి, OTP కోసం రిక్వెస్ట్ సబ్మిట్ కొట్టాలి.

6. ఆ తరువాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. ఆ OTPని వెబ్‌సైట్‌లో ఎంటర్ చేయాలి.

7. ఆ తరువాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మీ ఆధార్ కార్డు అసలైనదో, నకిలీదో అందులో కనిపిస్తుంది.

8. ఈ సమాచారంతో పాటు.. చెక్ చేసిన ఆధార్ నంబర్‌కు సంబంధించిన పేరు, రాష్ట్రం, వయస్సు, లింగం, ఇతర సమాచారం అంతా స్క్రీన్‌పై కనిపిస్తుంది.

9. ఈ వివరాలు మీ వద్ద ఉన్న ఆధార్ కార్డుపై వివరాలు ఒకేలా ఉంటే.. అది నిజమైనదిగా నిర్ధారించుకోవచ్చు.

10. ఆధార్ కార్డ్‌లోని QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఆఫ్‌లైన్‌లో కూడా ఆధార్ కార్డ్ నిజమైనదా? నకిలీదా? చెక్ చేసుకోవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!