Lucknow: సాధ్విపై దారుణం.. మత్తు మందు ఇచ్చి పైశాచికం.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు..
లఖ్ నవూ.. నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. నిన్నటికి నిన్న ట్యూషన్ కు వెళ్లి తిరిగి వస్తున్న బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనను మరవకముందే.. మరోసారి అలాంటి ఇన్సిడింటే జరిగింది. అయితే ఈ సారి 55 ఏళ్ల..
లఖ్ నవూ.. నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. నిన్నటికి నిన్న ట్యూషన్ కు వెళ్లి తిరిగి వస్తున్న బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనను మరవకముందే.. మరోసారి అలాంటి ఇన్సిడింటే జరిగింది. అయితే ఈ సారి 55 ఏళ్ల సాధ్విపై సామూహిక అత్యాచారం చేయడం కలకలం రేపింది. గోమతీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఓ ఆశ్రమంలో నివాసముంటున్న ఓ మహిళపై నలుగురు వ్యక్తులు మత్తు మందు ఇచ్చి ఈ దారుణానికి పాలప్డారు. అంతే కాకుండా ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే ఆశ్రమం నుంచి వెళ్లగొడతామని బెదిరించినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని కర్చన ప్రాంతానికి చెందిన మహిళ.. లఖ్ నవూలోని ఓ ఆశ్రమంలో ఉంటోంది. అంతకు ముందు ఆమె మథురలోని ఓ ఆశ్రమంలో నివసించేది. ఆ సమయంలో ప్రయాగ్‌రాజ్‌లో మాగ్ జాతర జరిగింది. దీంతో ఆమె అక్కడికి వచ్చింది. అక్కడ ఓ వ్యక్తితో ఏర్పడిన పరిచయంతో ఆమె లఖ్ నవూలోని సాధిక బృందావనంలోని రుక్మణి బహార్ ఆశ్రమానికి చేరుకుంది. కొన్నాళ్లు బాగానే ఉన్న ఆమెపై క్రమంగా వేధింపులు మొదలయ్యాయి. ఆశ్రమ మహంత్.. తనపై అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగికంగానూ వేధించినట్లు ఆమె పోలీసులకు తెలిపింది.
అక్టోబర్ 4 న ఎవరూ లేని సమయంలో నలుగురు వ్యక్తులు.. మహిళ తీసుకునే ఆహారంలో మత్తుపదార్థాలు కలిపారు. దీంతో ఆమె స్పృహ తప్పి అపస్మారక స్థితికి చేరుకుంది. అనంతరం నలుగురు ఒకరి తర్వాత మరొకరు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్పృహ వచ్చాక చూసుకుంటే.. నిర్మానుష్య ప్రదేశంలో, దుర్భర స్థితిలో ఉన్నట్లు ఆమె గుర్తించింది. అక్కడే ఉన్న ఆ నలుగురు వ్యక్తులు ఆమెను బెదిరించారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై బాధితురాలు ఆశ్రమ మహంత్ కు ఫిర్యాదు చేసింది. అయితే అతను కూడా నిందితుల వైపే నిలవడంతో బాధితురాలు షాక్ అయింది. ఇక్కడే ఉండాలనుకుంటే ఇదంతా సహించాల్సిందేనని తనతో చెప్పినట్లు ఆమె వాపోయింది.
పైనల్ గా వారి బారి నుంచి బయటపడిన బాధితురాలు.. జరిగిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న గోమతినగర్ ఇన్‌స్పెక్టర్ దినేష్ చంద్ర మిశ్రా.. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నిందితులు ఆశ్రమం నుంచి పరారీలో ఉన్నారని వారి కోసం వెతుకుతున్నామని వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..