TSPSC Group 1: గ్రూప్‌1 పరీక్ష కటాఫ్‌ మార్కులపై క్లారిటీ ఇచ్చిన టీఎస్‌పీఎస్సీ.. మెయిన్స్‌కు ఎలా ఎంపిక చేస్తారంటే..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి గ్రూప్‌ 1 పరీక్షను టీఎస్‌పీఎస్‌సీ ఆదివారం నిర్వహించిన విషయం తెలిసిందే. 503 పోస్టులకు గాను మొత్తం 2 లక్షల 86 వేల 51 మంది హాజరయ్యారు. ఇక పరీక్షా పత్రాన్ని చాలా టఫ్‌గా...

TSPSC Group 1: గ్రూప్‌1 పరీక్ష కటాఫ్‌ మార్కులపై క్లారిటీ ఇచ్చిన టీఎస్‌పీఎస్సీ.. మెయిన్స్‌కు ఎలా ఎంపిక చేస్తారంటే..
Tspsc Group 1 Exam
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 18, 2022 | 6:15 AM

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి గ్రూప్‌ 1 పరీక్షను టీఎస్‌పీఎస్‌సీ ఆదివారం నిర్వహించిన విషయం తెలిసిందే. 503 పోస్టులకు గాను మొత్తం 2 లక్షల 86 వేల 51 మంది హాజరయ్యారు. ఇక పరీక్షా పత్రాన్ని చాలా టఫ్‌గా ఇచ్చారని కొందరు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష కటాఫ్‌ మార్కులపై సోషల్‌ మీడియాలో కొన్ని వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ప్రిలిమినరీలో ఇన్ని మార్కులు వస్తే మెయిన్స్‌కు ఎంపిక చేస్తారంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ విషయమై టీఎస్‌పీఎస్సీ స్పష్టత ఇచ్చింది. ప్రిలిమినరీ పరీక్షలో కనీస అర్హత మార్కులు ఉండవని స్పష్టం చేసింది. ప్రిలిమినరీ పరీక్ష కేవలం అభ్యర్థులను ఫిల్టర్‌ చేయడానికి మాత్రమే అని తెలిపింది. గతంలో మార్కుల ప్రాతిపదికన ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేసే విధానం ఉండేదన కానీ.. ఈ ఏడాది ఏప్రిల్ 25న ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం.. మల్టీ జోన్ వారీగా రిజర్వేషన్ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేస్తామని క్లారిటీ ఇచ్చేసింది.

ఇక చాలా ఏళ్ల తర్వాత గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ రావడంతో పెద్ద ఎత్తున హాజరయ్యారు. 503 పోస్టులకు ఏకంగా 3 లక్షల 80 వేల మంది దనఖాస్తు చేసుకున్నారు. అయితే వీరిలో 3 లక్షల 42 వేల మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,019 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్‌ను నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా