AP Jobs: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా మెడికల్ పోస్టుల భర్తీ.. నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..
ఆంధ్రప్రదేశ్ వైద్య మంత్రిత్వశాఖ భారీగా మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్, సూపర్ స్పెషాలిటీ డాక్టర్...
ఆంధ్రప్రదేశ్ వైద్య మంత్రిత్వశాఖ భారీగా మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్, సూపర్ స్పెషాలిటీ డాక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 400కి పైగా ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో స్పెషలిస్ట్ డాక్టర్, సూపర్ స్పెషాలిటీ డాక్టర్ పోస్టులు ఉన్నాయి.
* రేడియాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఫొరెన్సిక్ మెడిసిన్, పాథాలజీ, కార్డియాలజీ, యూరాలజీ, న్యూరో సర్జరీ, పెడియాట్రిక్ సర్జరీ, జనరల్ మెడిసిన్ విభాగాల్లో ఈ ఖాళీల ఉన్నాయి.
* డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్-300, ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్-100కి పైగా ఖాళీల ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా/ డీఎన్‌బీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 42 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 61960 నుంచి రూ.160000 వరకు చెల్లిస్తారు.
* అభ్యర్థులను ఇంటర్వ్యూలో చూపిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఇంటర్వ్యూలను ఆఫీస్ ఆఫ్ ది డైరక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఏపీ గవర్నమెంట్, ఓల్డ్ జీజీహెచ్ క్యాంపస్, హనుమాన్ పేట్, విజయవాడ, ఏపీ, 520003 అడ్రస్‌లో నిర్వహిస్తారు.
* ఇంటర్వ్యూలను 19, 20, 21.10.2022 తేదీల్లో నిర్వహించనున్నారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..