AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: చిన్నారిపై క్రూరత్వం.. ఫోన్ దొంగలించాడంటూ బావిలో వేలాడదీశాడు.. అంతటితో ఆగకుండా..

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది.. మొబైల్ ఫోన్ దొంగతనం చేశాడంటూ బావిలో ఓ మైనర్ బాలుడిని బావిలో వేలాడదీశారు. ఆ బాలుడు తాను దొంగతనం చెయ్యలేదని ఎంత చెప్పినా సరే.. వినలేదు..

Watch: చిన్నారిపై క్రూరత్వం.. ఫోన్ దొంగలించాడంటూ బావిలో వేలాడదీశాడు.. అంతటితో ఆగకుండా..
Mobile Phone
Shaik Madar Saheb
|

Updated on: Oct 18, 2022 | 9:49 AM

Share

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది.. మొబైల్ ఫోన్ దొంగతనం చేశాడంటూ బావిలో ఓ మైనర్ బాలుడిని బావిలో వేలాడదీశారు. ఆ బాలుడు తాను దొంగతనం చెయ్యలేదని ఎంత చెప్పినా సరే.. వినలేదు.. కనీసం కనికరం లేకుండా.. 12ఏళ్ల బాలుడిని దారుణంగా కొట్టి.. బావిలో వేలాడదీశారు. ఈ దృశ్యాన్ని మరో వ్యక్తి మొబైల్‌లో చిత్రీకరించడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటన మధ్య ప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో జరిగింది. చిన్నారిని చిత్ర హింసలు పెట్టే సమయంలో వీడియో తీసిన మరో వ్యక్తి ఆ వీడియోను చిన్నారి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే పోలీసులు తనను కూడా స్టేషన్‌కు పిలిచి నిందితుడితో పాటు కొట్టారని వీడియో తీసిన వ్యక్తి ఆరోపించారు.

లవ్‌కుష్‌నగర్‌లోని అక్టోహాన్‌ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. మొబైల్ దొంగతనం చేశాడని బాలుడిని పట్టుకున్న నిందితుడు.. దారుణంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా.. 20 అడుగుల లోతైన బావిలో 5 నిమిషాల పాటు ఒక చేత్తో పట్టుకోని వేలాడదీసాడు. తాను దొంగతనం చేయలేదని వేడుకుంటున్నా కనీసం కనికరించలేదు.. ఈ సమయంలో అటుగా వెళ్తున్న ఓ యువకుడు వీడియో తీసి బాధిత చిన్నారి తల్లిదండ్రులకు చూపించాడు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం సాయంత్రం తల్లిదండ్రులు బాధిత చిన్నారితో కలిసి లవకుష్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ హేమంత్ నాయక్.. నిందితుడు అజిత్ రాజ్‌పుత్‌పై హత్యాయత్నం, ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

అయితే.. తాను ఈ దృశ్యాన్ని రికార్డు చేసి బాలుడి తల్లిదండ్రులకు చూపించడంతోనే ఈ ఘటన కలకలం రేపిందని.. లేకపోతే.. ఇంత జరిగేది కాదంటూ ఔట్‌పోస్టు ఇన్‌చార్జి ప్రతా దూబే తనను కొట్టారని.. కులం పేరుతో దూషించారని వీడియో తీసిన వ్యక్తి కిషోర్ ఆరోపిస్తున్నాడు. కాగా.. బావిలో 14 అడుగుల మేర నీరు నిండి ఉందని.. నిందితుడు బాలుడిని వదిలేస్తే చనిపోయేవాడని.. బాధిత బాలుడి తల్లిదండ్రులు పేర్కొన్నారు. వీడియో చూడగానే గుండె తరుక్కుపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

కాగా.. దీనిపై ఛతర్ పూర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ విక్రమ్ సింగ్ స్పందించారు. నిందితుడిపై కేసు నమోదు చేశామని.. పోలీసుల వ్యవహారంపై కూడా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Follow Us
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!