AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snake: ఇదే కోపంరా బాబు.. తనను కాటేసిందని పామునే కొరికి చంపేసిన 8 ఏళ్ల బాలుడు

సాధారణంగా జనాలు పామును చూస్తే భయంతో పరుగులు పెడతారు. కొందరైతే పాము అనే పదాన్ని వింటేనే భయపడిపోతుంటారు. అలాంటి ఒక వ్యక్తికి పాము కరిస్తే ఏం చేస్తాం వెంటనే చికిత్స నిమిత్తం..

Snake: ఇదే కోపంరా బాబు.. తనను కాటేసిందని పామునే కొరికి చంపేసిన 8 ఏళ్ల బాలుడు
Snake
Subhash Goud
| Edited By: Ram Naramaneni|

Updated on: Nov 03, 2022 | 7:36 AM

Share

సాధారణంగా జనాలు పామును చూస్తే భయంతో పరుగులు పెడతారు. కొందరైతే పాము అనే పదాన్ని వింటేనే భయపడిపోతుంటారు. అలాంటి ఒక వ్యక్తికి పాము కరిస్తే ఏం చేస్తాం వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తాము. కానీ ఓ 8 ఏళ్ల బాలుడు మాత్రం కాటేసిన పాముపైనే పగబట్టాడు. తనను కాటేసి అక్కడి నుంచి పారిపోతున్న పామును పట్టుకుని తన నోటికి కరిచి చంపేశాడు. దీనిని చూసి షాక్‌కు గురైన బాలుడి తల్లిదండ్రులు వెంటనే బాలున్ని ఆస్పత్రికి తరలించారు. అతన్ని వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ చేసినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ ఘటనల ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

జష్పూర్ గార్డెన్ బ్లాక్ లోని పండారపత్ అనే ప్రాంతంలో నివసిస్తున్న పహారి కోరువ అనే కుటుంబానికి చెందిన 8 ఏళ్ల బాలుడు దీపక్ సమీపంలో ఉంటున్న తన సోదరి ఇంటికి వెళ్ళాడు. అక్కడే మిగతా పిల్లలతో ఆడుకుంటూ ఉండగా అతని పాము కాటు వేసింది. దీంతో దీపక్‌కు పాముపై కోపం వచ్చింది. వెంటనే ఆ పామును పట్టుకుని కోరికేశాడు. వెంటనే పాము మృతి చెందింది. ఈ గిరిజన జిల్లాలో పాములు అధికంగా ఉంటాయట. అందుకే ఈ ప్రదేశాన్ని నాగ్లోక్ (పాముల నివాసం) అని కూడా పిలుస్తారు. ఇక్కడి ప్రాంతం దాదాపు 200 రకాల పాములకు నిలయమని తెలుస్తోంది.

అయితే పామును ఎందుకు కొరికి చంపేశావని అక్కడి మీడియా బాలుడిని ప్రశ్నిస్తే తనను ఒక పాము కాటేసిందని, తనకు కోపం రావడంతో పామును కొరికి చంపేశానని చెప్పుకొచ్చాడు. కాగా, ఇక్కడ ప్రాంతంలో అనేక రకాల పాముల జాతులున్నాయని అక్కడి వారు చెబుతున్నారు. ఇందులో చాలా విషపూరితమైన పాములు కూడా ఉన్నాయంటున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కనిపించే అన్ని రకాల పాములలో 80 శాం పాములు జష్పూర్‌లోనే ఉన్నాయని పాములు పట్టే వ్యక్తి కేసర్‌ హుస్సేన్‌ చెబుతున్నారు. ఇక్కడ మూడేళ్లలో 35 మంది పాము కాటుకు గురయ్యారు. 2017లో పాము కాటుతో 16 మంది మృతి చెందగా, 2018లో ఆరుగురు, 2019లో 12 మంది పాము కాటుతో మృతి చెందినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి