Cyber Attacks: భారత వెబ్‌సైట్లపై సైబర్ దాడులు.. దేశ వ్యాప్తంగా 70 వెబ్‌సైట్లు, పోర్టల్స్ హ్యాక్
Cyber Attacks: భారత్‌కు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల వెబ్‌సైట్లను పైబర్ నేరగాళ్లు దాడులకు పాల్పడుతున్నారు. దేశ వ్యాప్తంగా 70 వెబ్‌సైట్లు, పోర్టల్స్‌ను హ్యాక్‌కు..
Cyber Attacks: భారత్‌కు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల వెబ్‌సైట్లను పైబర్ నేరగాళ్లు దాడులకు పాల్పడుతున్నారు. దేశ వ్యాప్తంగా 70 వెబ్‌సైట్లు, పోర్టల్స్‌ను హ్యాక్‌కు గురయ్యాయి. డ్రాగన్‌ఫోర్స్, మలేషియా, 1877 సంస్థ, కురుదేశ్ కోరడర్స్ పేరుతో హ్యా్‌క్ అయ్యాయి. అలాగే హైదరాబాద్‌కు చెందిన అగ్రిటెక్ కంపెనీలు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పోర్టల్స్, భవన్స్ స్కూల్ హ్యాక్‌కు గురయ్యాయి. అంతేకాకుండా కొన్ని బ్యాంకింగ్ వెబ్‌సైట్లు కూడా హ్యాక్‌కు గురయ్యాయి. కాగా, మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ నేతలు వ్యాఖ్యలకు వ్యతిరేకంగా భారత్‌పై ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని అల్‌ఖైదా ఉగర్వాద సంస్థ బెదిరింపులకు పాల్పడింది. దీంతో తాజాగా భారత్‌కు చెందిన ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థల వెబ్‌సైట్‌లను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. ఒక్క మహారాష్ట్రలోని 50 పైగా కంపెనీలు హ్యాక్‌కు గురైనట్లు సమాచారం. అలాగే జూన్ 8 నుంచి 12వ తేదీ మధ్య భారత ప్రభుత్వానికి చెందిన వెబ్‌సైట్లతో పాటు ప్రైవేటు కంపెనీల పోర్టల్స్ హ్యాక్ అయినట్లు సమాచారం.
ఐసిఏఆర్‌కు చెందిన వెబ్‌సైట్‌ను మాత్రం ఇంకా పునరుద్ధరించలేకపోయారు. ఈ తరహా దాడులతో వ్యక్తిగత సమాచారం లీక్ అవుతుందని సైబర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయిల్ వెబ్‌సైట్లపై దాడులు చేసినపుడు ఆ దేశానికి చెందిన పౌరుల వ్యక్తిగత సమాచారం, వీపీఎన్ వివరాలు,పాస్‌పోర్ట్ వివరాలను హ్యాకర్లు లీక్ చేసినట్లు పేర్కొంటున్నారు. వెబ్‌సైట్ల నిర్వహణలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసుకోవడమే పరిష్కారమని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. మొత్తం 13వేల సభ్యులున్న ఈ హ్యాకర్ గ్రూప్ భారతదేశంలోని ప్రముఖ బ్యాంకు వెబ్‌సైట్లు, ప్రముఖ కంపెనీల వెబ్‌సైట్లను హ్యాక్ చేసే ప్రయత్నం చేసినట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి