5 Paise Biryani: 5 పైసలకే వేడివేడిగా నోరూరించే బిర్యానీ.. ఎగబడ్డ జనం.. షట్టర్లు బంద్

బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. కాగా ఇప్పుడు నాన్-వెజ్ రేట్లు మండిపోతున్న నేపథ్యంలో.. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ధరలు కూడా కొండెక్కాయి.

5 Paise Biryani: 5 పైసలకే వేడివేడిగా నోరూరించే బిర్యానీ.. ఎగబడ్డ జనం.. షట్టర్లు బంద్
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 21, 2021 | 9:25 PM

బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. కాగా ఇప్పుడు నాన్-వెజ్ రేట్లు మండిపోతున్న నేపథ్యంలో.. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ధరలు కూడా కొండెక్కాయి. అలాంటి బిర్యానీ ధర కేవలం 5 పైసలే అంటే భోజన ప్రియులు ఆ ప్రాంతంలో క్యూ కడతారు. ఇలాగే ఓ హోటల్‌ ప్రమోషన్ కోసం… ప్రారంభ ఆఫర్‌గా ప్రకటిస్తే జనాలు ఎగబడి తిన్నారు. ఆ ఆఫర్‌ కొన్ని షరతులతో విధించినా కూడా అనూహ్య స్పందన రావడంతో ఆ హోటల్‌ పరిసర ప్రాంతాలు జనాలతో కిక్కిరిసిపోయాడు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని మధురై జిల్లా సెల్లూర్‌లో సుకన్య బిర్యానీ హోటల్‌ తాజాగా ప్రారంభించారు. ప్రారంభ ఆఫర్‌గా 5 పైసల నాణెం తీసుకొస్తే ఫ్రీగా బిర్యానీ ఇస్తామని అనౌన్స్ చేశారు. చెల్లని ఐదు పైసల నాణెం ఎవరి వద్ద ఉంటాయని భావించిన హోటల్‌ ఓనర్‌కు షాక్ తగిలింది. పెద్ద ఎత్తున జనాలు ఐదు పైసల నాణెం తీసుకుని వచ్చి హోటల్‌ ముందు క్యూ కట్టారు. దాదాపు 300 మంది ఆ నాణెలు తీసుకొచ్చారు. అయితే బిర్యానీ ధ్యాసలో పడి కరోనా సోకే విషయాన్ని మరిచి ఎగబడ్డారు. సగం మంది మాస్కులు పెట్టుకోలేదు. ఇక భౌతిక దూరం అస్సలు పాటించలేదు. ఊహించనంతమంది  రావడంతో  యాజమాన్యం హోటల్‌ షట్లర్లు మూసేసింది. ఆలస్యంగా వచ్చిన కొందరు నాణెం ఇచ్చి బిర్యానీ అడగ్గా ఇవ్వలేదు. గతంలో కూడా పలుచోట్లు రెస్టారెంట్ల ప్రమోషన్స్ కోసం  ఇలాంటి ఆఫర్స్ ప్రకటించాయి.

5 Paise Biryani

5 Paise Biryani

Also Read: ఒకొక్కటిగా బయటకు వస్తున్న రాజ్ కుంద్రా చీకటి వ్యవహారాలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు

‘రంగమార్తాండ’ గురించి కీలక అప్‌డేట్.. అనుమానాలు పటాపంచలు చేసిన క్రియేటివ్ డైరెక్టర్

'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..