Bank Robbery Case: చెన్నైలో బ్యాంకు చోరీ డ్రామా వెనుక అసలు కథ ఇదే.. కూల్ డ్రింక్స్ ఇచ్చి మరి..
సంచలనం సృష్టించిన బ్యాంకు దోపిడి కేసును చెన్నై పోలీసులు అనతి కాలంలోనే చేధించారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Chennai Bank Robbery Case: చెన్నై ఫెడరల్ బ్యాంక్ దోపిడి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. సొరంగం వేసి మరి దుండగులు కిలోల కొద్ది బంగారు అభరణాలను, డబ్బును దోచుకెళ్లారు. కాగా.. సంచలనం సృష్టించిన బ్యాంకు దోపిడి కేసును చెన్నై పోలీసులు అనతి కాలంలోనే చేధించారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. నిందితుల నుంచి తొమ్మిది కోట్ల విలువైన 18 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఫెడరల్ బ్యాంక్ దొపిడికి ఇద్దరు బ్యాంక్ స్టాప్, మరో ఐదుగురు బయటి వ్యక్తులు పాల్పడినట్లు చెన్నై పోలీసులు చెప్పారు. బ్యాంక్ లో 32 కిలోల బంగారం దోచుకెళ్లినట్లు వెల్లడించారు. ప్రస్తుతం 18 కేజీలు మాత్రమే నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నామని, మిగతా బంగారం కోసం అన్వేషిస్తున్నామని తెలిపారు. మరో ముగ్గురు కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు.
ఈనెల 13వ తేదీన ఫెడరల్ బ్యాంక్ సిబ్బందికి కూల్ డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చి.. బ్యాంక్ లో చోరీకి పాల్పడ్డారు దొంగలు. చెన్నై ఫెడరల్ బ్యాంకును అడ్డంగా దోచేశారు దొంగలు. నాలుగు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులు సిసి టీవీ ఫుటేజ్ ఆధారంగా దోపిడిని చేధించారు. ఈ దోపిడి వెనుక కీలక సూత్రధారులు బ్యాంకు సిబ్బందే ఉన్నట్లు పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..