Pin Code: ఆరు అంకెల పోస్టల్ పిన్‌కోడ్‌కు 50 ఏళ్లు పూర్తి.. ఈ కోడ్‌ను ఎందుకు రూపొందించారు.. ఎన్నో ఆసక్తికర విషయాలు
Postal Pin Code Number: దేశం 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవాన్ని జరుపుకొంది. ఇక పిన్ కోడ్ అంటే పోస్టల్ ఐడెంటిఫికేషన్ నంబర్ కూడా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది..
Postal Pin Code Number: దేశం 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవాన్ని జరుపుకొంది. ఇక పిన్ కోడ్ అంటే పోస్టల్ ఐడెంటిఫికేషన్ నంబర్ కూడా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. భారతదేశంలో పోస్టల్ పిన్‌కోడ్ అంటే ఆరు అంకెల కోడ్‌ను 1962 ఆగస్టు 15న ప్రారంభించారు. పోస్టల్ డిపార్ట్‌మెంట్ ప్రకారం.. ఇప్పట్లో దేశంలో పోస్టల్ ద్వారా లేఖలు, పత్రాలు, ఇతర వస్తువులను అందించడం కష్టంగా ఉండేది. ఈ గందరగోళాన్ని తొలగించడానికి, పోస్టును సులభంగా వారి చిరునామాకు చేరవేసేలాపిన్‌కోడ్ సిస్టమ్ అమలు చేశారు. పిన్‌కోడ్ వ్యవస్థను అభివృద్ధి చేసిన ఘనత సంస్కృత కవి, కేంద్ర కార్యకర్త శ్రీరామ్ భికాజీ వేలంకర్‌కు చెందుతుంది. పిన్‌కోడ్ అంటే 6 అంకెలతో కూడిన సంఖ్య.
6 అంకెల పిన్‌కోడ్ అంటే ఏమిటి?
దేశంలో పోస్టాఫీసు లేటర్స్, ఇతర వస్తువులను సులభంగా అందించేందుకు 6 అంకెల పిన్ కోడ్ రూపొందించారు. ఇందులో మొదటి సంఖ్య అర్థం రాష్ట్రం పేరును సూచిస్తుంది. రెండవ అంకె మండలాన్ని సూచిస్తుంది. మూడో అంకె జిల్లా సమాచారాన్ని అందిస్తుంది. అదే సమయంలో, నాల్గవ, ఐదవ, ఆరవ అంకెలు పోస్టాఫీసు ఉన్న ప్రాంతాన్ని సూచిస్తుంది. ఈ పిన్‌కోడ్ ద్వారా ఉత్తరాలు, వస్తువులు పోస్ట్ ఆఫీస్ లేదా కొరియర్ ఏజెన్సీ ద్వారా సులభంగా ఆ వ్యక్తికి చేర్చబడతాయి. ఈ పిన్‌కోడ్ వల్ల సదరు వ్యక్తి చిరునామాకు సులభంగా చేర్చే విధంగా ఉంటుంది. అయితే ఇందులో ఆర్మీ పోస్టల్ సర్వీస్‌కు ఒక పాయింట్ రిజర్వ్ చేయబడింది. దేశంలో మొత్తం 19101 పిన్‌లు కేటాయించబడ్డాయి. వాటి సాయంతో వారి లొకేషన్‌ను తెలుసుకోవచ్చు.
దేశంలో పిన్‌కోడ్‌ని అమలు చేయాలనే ఆలోచన శ్రీరామ్ భికాజీకి వచ్చింది. ఆ సమయంలో అతను కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా పని చేస్తున్నాడు. అలాగే టెలిగ్రాఫ్ బోర్డులో సీనియర్ సభ్యుడు కూడా. ఆ సమయంలో దేశంలోని వస్తువుల పంపిణీకి ఇటువంటి వ్యవస్థ అవసరమని, ఇలాంటి పిన్‌కోడ్ వల్ల ప్రతి రాష్ట్రంలోని గ్రామ గ్రామానికి సులభంగా డెలివరీ చేయవచ్చనే ఉద్దేశంతో ఈ వ్యవస్థను సృష్టించారు. ఇప్పుడు GPS యుగంలో కూడా పిన్‌కోడ్ ప్రాముఖ్యత ఏ మాత్రం తగ్గలేదు.
శ్రీరామ్ భికాజీకి ఢిల్లీలో జరిగిన వరల్డ్ ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్ తర్వాత చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. ఇందులో 120 దేశాలు ఉన్నాయి. 1973 డిసెంబర్ 31న పదవీ విరమణ చేశారు. అతను సాధించిన విజయాలకు అనేక అవార్డులతో సత్కరించబడ్డాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి