Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

News Click: ముదురుతోన్న ‘న్యూస్‌క్లిక్’ వివాదం.. చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రపతి, సీజేఐలకు 255 మంది ప్రముఖుల లేఖ..

News Click Issue: రెండేళ్ల క్రితం మీడియా పోర్టల్ న్యూస్‌క్లిక్‌కు విదేశాల నుంచి సుమారు రూ.38 కోట్ల నిధులు వచ్చినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణలో తేలింది. అమెరికన్ మిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్ తరపున న్యూస్‌క్లిక్‌కు భారీగా నిధులు అందినట్లు దర్యాప్తులో తేలింది. నెవిల్లే చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CPC)తో సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపించారు. న్యూస్‌క్లిక్‌కు మూడేళ్లలో రూ.38 కోట్ల నిధులు వచ్చినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఇది తీస్తా సెతల్వాద్‌తో సహా చాలా మందికి పంపిణీ చేశారని ప్రకటించింది.

News Click: ముదురుతోన్న 'న్యూస్‌క్లిక్' వివాదం.. చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రపతి, సీజేఐలకు 255 మంది ప్రముఖుల లేఖ..
Rastrapati Bhavan Delhi
Follow us
Venkata Chari

|

Updated on: Aug 11, 2023 | 6:23 PM

News Click Issue: ఆన్ లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్ క్లిక్ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. ది న్యూయార్క్ టైమ్స్ ఇటీవలే ప్రచురించిన కథనాలతో ప్రస్తుతం ఈ వ్యవహారం లోక్‌సభలోనూ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య లొల్లి షురువైంది. కాగా, ఈ వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది. 255 మంది ప్రముఖులు న్యూస్‌క్లిక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతితోపాటు సీజేఐకి లేఖ రాశారు. ఇందులో దేశంలో అత్యున్నత పదవుల్లో ఉన్నవాళ్లు కూడా ఉన్నారు. వీళ్లంతా సంతకాలు చేసి ఈ లేఖను పంపించారు. ఈ మేరకు దేశ-వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక, వ్యంగ్యపూర్వకంగా పత్రికా రహిత వ్యతిరేక ఎజెండాతో సాగుతోన్న న్యూస్ క్లిక్‌ను అడ్డుకోవాలని వారు కోరారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ మన ప్రజాస్వామ్యంలో జోక్యం చేసుకునేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తుదంటూ గుర్తు చేశారు. న్యూ యార్క్ టైమ్స్ పరిశోధన, న్యూస్ పోర్టల్ న్యూస్‌క్లిక్‌ వ్యవహారాన్ని బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. విదేశీ శక్తుల కోరికలతో నడిచే ఇలాంటి వాటిని గట్టిగా బుద్ది చెప్పాలని ఈసందర్భంగా వారు కోరారు.

అసలు విషయం ఏంటంటే?

రెండేళ్ల క్రితం మీడియా పోర్టల్ న్యూస్‌క్లిక్‌కు విదేశాల నుంచి సుమారు రూ.38 కోట్ల నిధులు వచ్చినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణలో తేలింది. అమెరికన్ మిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్ తరపున న్యూస్‌క్లిక్‌కు భారీగా నిధులు అందినట్లు దర్యాప్తులో తేలింది. నెవిల్లే చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CPC)తో సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపించారు. న్యూస్‌క్లిక్‌కు మూడేళ్లలో రూ.38 కోట్ల నిధులు వచ్చినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఇది తీస్తా సెతల్వాద్‌తో సహా చాలా మందికి పంపిణీ చేశారని ప్రకటించింది. తాజాగా దీనిపై ‘ది న్యూయార్క్ టైమ్స్’ నివేదికలో ప్రచురించింది. కార్యకర్తల సమూహాలు, లాభాపేక్షలేని సంస్థలు, షెల్ కంపెనీలు, చైనాతో వారి నెట్‌వర్క్ బహిర్గతమైందంటూ అందులో రాసుకొచ్చింది. నెవిల్లే రాయ్ సింఘమ్ ఈ మొత్తం నెట్‌వర్క్‌కు కీలక భాగస్వామ్యంగా పనిచేసినట్లు పేర్కొంది. న్యూస్‌క్లిక్ అనే వార్తా సైట్‌కి సింఘమ్ నెట్‌వర్క్ నిధులు సమకూర్చిందని కార్పొరేట్ ఫైలింగ్‌లు వెల్లడిస్తాయని న్యూయార్క్ టైమ్స్ తన నివేదికలో నివేదించింది. దీని ద్వారా, చైనా ప్రభుత్వ సమస్యలను కవర్ చేశారంటూ రాసుకొచ్చింది.

ఇదే విషయంపై లోక్‌సభలోనూ తీవ్ర చర్చలు జరిగాయి. NEWS CLICKకి చైనా నుంచి నిధులు అందుతున్నాయని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే అన్నారు. NEWS CLICK దేశ వ్యతిరేకమని అన్నారు. చైనా నిధులతో మీడియా పోర్టల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాతావరణాన్ని సృష్టిస్తోందని నిషికాంత్ ఆరోపించారు. అంతే కాదు నిషికాంత్ దూబే ఈ అంశంపై కాంగ్రెస్‌ను కూడా టార్గెట్ చేశారు.

ఇవి కూడా చదవండి

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా మాట్లాడుతూ, ‘న్యూయార్క్ టైమ్స్’ వంటి వార్తాపత్రికలు కూడా ఇప్పుడు నెవిల్ రాయ్ సింఘమ్, అతని న్యూస్‌క్లిక్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (CPC) ప్రమాదకరమైన ఆయుధాలని ఒప్పుకుంటున్నాయి. ఇవి చైనా రాజకీయ ఎజెండాను ప్రచారం చేస్తున్నాయంటూ ఘాటుగానే స్పందించారు. కాంగ్రెస్ ప్రేమ అంతా న్యూస్‌క్లిక్‌తో ముడిపడి ఉందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ నకిలీ ప్రేమ దుకాణంలో చైనా వస్తువులు ఉన్నాయని ఆయన విమర్శించారు. న్యూస్ క్లిక్ ప్రారంభం కాగానే కోట్లాది రూపాయల నిధులు వచ్చాయన్నారు. ఈ భారత వ్యతిరేక ఎజెండాను కొనసాగించడానికి మేం అనుమతించమంటూ చెప్పుకొచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..