Bengaluru: బెంగళూరు వరదల్లో కొట్టుకుపోయిన రూ.2 కోట్ల విలువైన బంగారం, లబోదిబోమంటున్న యజమాని

కొద్దిరోజుల క్రితం బెంగళూరును అకాల వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. అయితే.. వరదల వల్ల బెంగళూరులోని ఓ బంగారం దుకాణం తీవ్రంగా నష్టపోయింది. బెంగళూరులోని మల్లేశ్వర్‌ ప్రాంతానికి చెందిన నగల దుకాణం వరద నీటిలో చిక్కుకుంది. చెత్తాచెదారం కలిసిన వరదనీరు షాపులోకి ఒక్కసారిగా పోటెత్తడంతో.. సిబ్బంది షటర్లు మూయలేకపోయారు.

Bengaluru: బెంగళూరు వరదల్లో కొట్టుకుపోయిన రూ.2 కోట్ల విలువైన బంగారం, లబోదిబోమంటున్న యజమాని
Gold
Follow us

|

Updated on: May 24, 2023 | 5:08 AM

కొద్దిరోజుల క్రితం బెంగళూరును అకాల వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. అయితే.. వరదల వల్ల బెంగళూరులోని ఓ బంగారం దుకాణం తీవ్రంగా నష్టపోయింది. బెంగళూరులోని మల్లేశ్వర్‌ ప్రాంతానికి చెందిన నగల దుకాణం వరద నీటిలో చిక్కుకుంది. చెత్తాచెదారం కలిసిన వరదనీరు షాపులోకి ఒక్కసారిగా పోటెత్తడంతో.. సిబ్బంది షటర్లు మూయలేకపోయారు. బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ అప్పటికే వరద నీరు ముంచెత్తింది. వెంటనే మున్సిపల్ అధికారులకు ఫోన్‌ చేసి, సహాయం కోరినా.. స్పందించలేదని మండిపడ్డారు. దాంతో.. వరదనీటిలో 80 శాతం బంగారం కొట్టుకుపోయిందని వాపోయారు షాపు యజమాని. కొట్టుకుపోయిన బంగారం విలువ దాదాపు రూ.2 కోట్లు ఉంటుందని చెప్పారు. అయితే.. గోల్డ్‌ షాపు దగ్గర్లో జరుగుతున్న నిర్మాణ పనులే ఆకస్మిక వరదకు కారణమని దుకాణం యజమాని ఆరోపించారు.

అధికారులు వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. అకాల వర్షాల కారణంగా కాలువలు పొంగిపొర్లాయి. రహదారుల నిండా చెత్త పేరుకుపోయింది. దానిని తొలగించలేక మున్సిపల్ సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. చెట్లు కూలిపోయాయని, వరద నీరు నిలిచిపోయిందంటూ సుమారు 600 వరకు ఫిర్యాదులు అందాయి. అదేసమయంలో.. ఆదివారం కేఆర్‌ కూడలి సమీపంలోని అండర్‌ పాస్‌లోకి వరద నీరు భారీగా చేరుకోవడంతో నీటిలో మునిగి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భానురేఖ అనే టెకీ మృతి చెందింది. అంతేకాదు.. భారీ వర్షాల కారణంగా కర్ణాటకలో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందారని వెల్లడించారు అధికారులు. ఏదేమైనా.. బెంగాళూరులో అకాల వర్షాలు.. ఓ గోల్డ్‌ షాప్‌ యజమానిని మాత్రం నిండా ముంచాయి. ఈ నేపథ్యంలో.. భారీగా నష్టపోయిన బంగారం షాప్‌ యజమానిని నూతన కర్ణాటక ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందా లేక సాయం చేయాలని కోరినా స్పందించని మున్సిపల్‌ సిబ్బందిపై చర్యలు తీసుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో