School Holiday: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. రేపు పాఠశాలలకు సెలవు..!

School Holiday: పాఠశాలలకు సెలవు అంటే విద్యార్థులు ఎగిరి గంతులేస్తుంటారు. సెలవులు వచ్చాయంటే ఎంజాయ్‌ చేసేందుకు రెడీగా ఉంటారు. రేపు అంటే గురువారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది ఆ ప్రభుత్వం..

Subhash Goud

|

Updated on: Dec 04, 2024 | 9:08 PM

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంచల్ తుపాను కారణంగా తమిళనాడులో గత 10 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తమిళనాడులోని పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఉత్తరాది జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

1 / 5
ఫెంచల్ తుఫాను చెన్నై తీరం దాటే అవకాశం ఉందని, చెన్నైకి రెడ్ అలర్ట్ ప్రకటించారు. అయితే తుపాను మరో వైపు వెళ్లడంతో చెన్నైకి ఇచ్చిన రెడ్ అలర్ట్ ను ఉపసంహరించుకున్నారు.

2 / 5
కాగా, ఫెంచల్ తుఫాను నవంబర్ 30న పుదుచ్చేరి, మరక్కం మధ్య తీరాన్ని తాకింది. దీంతో ఉత్తరాది జిల్లాలైన విల్లుపురం, కడలూరు, తిరువణ్ణామలై, ధర్మపురి, కళ్లకురిచ్చి, కృష్ణగిరి జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

3 / 5
ఫెంచల్ తుపాను కారణంగా ఉత్తరాది జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లడంతో జనజీవనం అస్తవ్యస్తం కావడంతో ఆయా జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు వరుస సెలవులు ప్రకటించారు.

4 / 5
ఫెంచల్ తుఫాను పుదుచ్చేరిలో తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఇప్పటివరకు సాధారణ జనజీవనం తిరిగి రాలేదు. ఈ పరిస్థితిలో పుదుచ్చేరిలోని 17 పాఠశాలలకు మాత్రమే రేపు (05.12.2024) సెలవు ఇచ్చారు.

5 / 5
Follow us