- Telugu News Photo Gallery Most dangerous and mysterious point in this forest in Tokyo, know details about it
Devils Forest: బాబోయ్.. ఇదేం భయంకర అడవిరా సామీ.. పుష్ప టీం కూడా కనిపెట్టలేని రహస్యాలేన్నో..!
ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన, అంతుచిక్కని అరుపులు వినిపిస్తున్న ఈ అడవిలోంచి రాత్రుళ్లు భయంకరమైన అరుపులు, కేకలు వినిపిస్తాయట. కేవలం అరుపులు మాత్రమే కాదు..ఈ అడవిలోకి వెళ్లినవారు.. తమంతటే తామే ఆత్మహత్య చేసుకుని చనిపోతారని కూడా చెబుతుంటారు. బహుషా పుష్పా సినిమా బృందానికి కూడా ఈ అడవి గురించి తెలియదనుకుంటా.. అలాంటి అడవి గురించి ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Dec 04, 2024 | 4:24 PM

ప్రపంచ వ్యాప్తంగా ఆధునీకరణ పేరిట అడవులు అంతరించి పోతున్నాయి. అయినప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అడవులు ఉన్నాయి. వాటిలో కొన్ని వింతైనవిగా ఉంటే, కొన్ని భయంకరమైన అడవులుగా ప్రసిద్ధి చెందాయి. కొన్ని అడవుల్లో అంతుచిక్కని మిస్టరీ దాగివుంటుంది. అలాంటిదే ప్రపంచంలోనే అతి భయంకరమైన, అత్యంత మిస్టీయస్ అడవి ఒకటి ఉంది. ఇది ఎంత భయంకరమైనది అంటే..ఈ అడవిలోకి వెళ్లినవారు.. తమంతటే తామే ఆత్మహత్య చేసుకుని చనిపోతారని కూడా చెబుతుంటారు.

ఈ రహస్యమైన అడవిని ఆత్మాహుతి అడవి అంటారు. ఈ అడవి జపాన్‌లో ఉంది. ఈ అడవిలో తరచూ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈ పచ్చటి అడవి చూసేందుకు అంతులేనిదిగా విస్తరించి ఉంది.. అడవిలోని నిశ్శబ్దం కూడా ఒక రకంగా భయపెడుతుంది.

ఈ అడవికి వచ్చిన వేలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారని సమాచారం. అందుకే ఈ అడవిని దెయ్యాల అడవిగా పిలుస్తారు. ఈ అడవి టోక్యో నుండి రెండు గంటల దూరంలో ఉంది. ఈ అడవిలో దయ్యాలు ఉంటాయని చెబుతారు. ఈ దెయ్యాలు ఆత్మహత్యకు ప్రేరేపిస్తాయని చాలా మంది నమ్ముతారు. అందుకే ఈ అడవి సమీపంలోకి వెళ్లాలంటే కూడా భయంతో వణికిపోతారు.

మెక్సికో నగరానికి సమీపంలో ఉన్న ఈ ద్వీపంలోని చెట్లు వందలాది బొమ్మలు వేలాడదీసి ఉంటాయి. అక్కడి దృశ్యాలు చూసేందుకు గగుర్పాటు కలిగించేవిగా ఉంటాయి. ఈ ద్వీపంలో నివసించే..ఏకైక వ్యక్తి.. డాన్ జూలియన్ సంటానా కొన్ని సంవత్సరాల క్రితం అక్కడి కాలువలో ఒక అమ్మాయి మృతదేహాన్ని చూశాడట. అతను అదే నీటిలో తేలుతున్న ఒక బొమ్మను కూడా చూశాడట. ఇక 2001లో తను కూడా చనిపోయాడని సమాచారం.

ప్రపంచంలోని ఈ అత్యంత రహస్యమైన, భయానకమైన అడవిలోకి వెళ్లిన ప్రజలు తమంతట తామే ఆత్మహత్యలు చేసుకుంటారని చెబుతారు. ఇలాంటి మిస్టీరియస్ అడవి వెనుక రహస్యం ఇంకా వెలుగులోకి రాలేదు. అందుకే దీన్ని ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన సూసైడ్ పాయింట్‌గా కూడా పిలుస్తారు. ఈ అడవి గురించి నిరంతరం పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు పరిశోధకులు.
