Rajasthan: ఆరునెలలుగా అత్యాచారం చేస్తున్నాడు.. భరించలేక ఆ మైనర్ బాలిక ఏం చేసిందంటే..!

14 ఏళ్ల అత్యాచార బాధితురాలు నిందితుడైన యువకుడిని హత్య చేసింది. అత్యాచారం చేసిన వ్యక్తి మాజీ సర్పంచ్ కుమారుడుగా తెలిసింది. అతని మృతదేహం మే 18న అల్వార్‌లోని కోట్‌కాసిమ్ ప్రాంతంలో రోడ్డు పక్కన కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Rajasthan: ఆరునెలలుగా అత్యాచారం చేస్తున్నాడు.. భరించలేక ఆ మైనర్ బాలిక ఏం చేసిందంటే..!
Gang Raped
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 07, 2022 | 9:50 PM

రాజస్థాన్‌లోని అల్వార్‌లో 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు నిందితుడైన యువకుడిని హత్య చేసింది. అత్యాచారం చేసిన వ్యక్తి మాజీ సర్పంచ్ కుమారుడుగా తెలిసింది. అతని మృతదేహం మే 18న అల్వార్‌లోని కోట్‌కాసిమ్ ప్రాంతంలో రోడ్డు పక్కన కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలికపై మాజీ సర్పంచ్ కుమారుడు బ్లాక్ మెయిల్ చేస్తూ చాలా కాలంగా అత్యాచారం చేస్తున్నాడు. ఆ తర్వాత తన సహోద్యోగులతో కూడా సంబంధాలు పెట్టుకోవాలని ఒత్తిడి తెచ్చేవాడు. ఇది తట్టుకోలేని బాలిక.. పొలంలోకి పిలిచి అతన్ని చంపేసింది. ఘటన జరిగిన సమయంలో యువకుడు మద్యం మత్తులో ఉన్నాడు.

మే 17వ తేదీ రాత్రి మాజీ సర్పంచ్ ధనిరామ్ యాదవ్ కుమారుడు విక్రమ్ యాదవ్ (45) హత్యకు గురయ్యాడని గ్రామానికి చెందిన భివాడి ఏఎస్పీ అతుల్ సాహు తెలిపారు. మరుసటి రోజు మే 18న అతని మృతదేహం గ్రామ సమీపంలోని రహదారిపై కనిపించింది. మృతదేహాన్ని సాధారణ మరణంగా భావించి బంధువులు ఇంటికి తీసుకెళ్లారు. కిందపడి చనిపోయాడని భావించారు. అంత్యక్రియల సమయంలో విక్రమ్ మెడపై ఓ గుర్తు కనిపించింది. రక్తపు మరకలు కూడా కనిపించాయి. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. విచారణలో గ్రామానికి చెందిన 10వ తరగతి చదువుతున్న బాలిక పాత్రపై అనుమానం వచ్చింది. ఆమె కుటుంబ సభ్యులు, బంధువులను విచారించగా, అసలు విషయం బయటపడింది.

మైనర్ బాలిక విక్రమ్ యాదవ్ ఇంటికి నీళ్ల కోసం వెళ్లేదని ఏఎస్పీ సాహు తెలిపారు. నెలన్నర క్రితం మైనర్ తన ప్రేమికుడితో మాట్లాడేందుకు విక్రమ్ ఫోన్‌ను వాడింది.. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ విక్రమ్ ఫోన్‌లో రికార్డ్ అయింది. ఆ ఆడియో రికార్డిండ్‌ ఆధారంగా విక్రమ్ ఆమెను బ్లాక్ మెయిల్ చేయడంతోపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. విక్రమ్ తన స్నేహితులతో కూడా సంబంధం పెట్టుకోవాలని మైనర్‌పై ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. దీంతో బాలిక ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు విక్రమ్ కంటే ముందే గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులు మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు 6 నెలల క్రితం ఈ యువకులకు కూడా అతడి వ్యవహారం తెలిసింది. దీంతో యువకులిద్దరూ బ్లాక్ మెయిల్ చేస్తూ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.

ఇవి కూడా చదవండి

విక్రమ్‌ పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక ఎలాగైన అతన్ని అంతం చేయాలనుకుంది..విక్రమ్‌ యాదవ్‌ను చంపాలని ప్లాన్ చేసింది. పథకం ప్రకారం మే 17న రాత్రి తనను కలవాలని విక్రమ్‌కు ఫోన్ చేసింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న విక్రమ్‌ యాదవ్‌ను గొంతు కోసి హతమార్చింది. ఈ కేసులో మైనర్‌ బాలికతో పాటు నలుగురిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.  మృతుడు విక్రమ్ యాదవ్‌కు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు పట్టభద్రుడయ్యాడు. చిన్న కొడుకు ఢిల్లీ యూనివర్సిటీలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ