Bengaluru: బెంగళూరులో ఘోర ప్రమాదం.. బాణాసంచా గోడౌన్‌లో పేలుడు.. 13 మంది సజీవ దహనం
కర్ణాటక తమిళనాడు సరిహద్దులో శనివారం ఘోరప్రమాదం సంభవించింది. అత్తిపల్లిలోని బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరగడంతో ఇప్పటివరకు 13 మంది మృతిచెందారు. అదే విధంగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 20 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రెస్క్యూటీమ్ సహాయక చర్యలు చేపట్టింది. ఈ అగ్ని ప్రమాదంలో కోటి రూపాయల విలువైన బాణాసంచాతో పాటు..

కర్ణాటక తమిళనాడు సరిహద్దులో శనివారం ఘోరప్రమాదం సంభవించింది. అత్తిపల్లిలోని బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరగడంతో ఇప్పటివరకు 13 మంది మృతిచెందారు. అదే విధంగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 20 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రెస్క్యూటీమ్ సహాయక చర్యలు చేపట్టింది. ఈ అగ్ని ప్రమాదంలో కోటి రూపాయల విలువైన బాణాసంచాతో పాటు 1 క్యాంట్రో, 2 బొలెరోలు, 7 బైక్‌లు కూడా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంతో అత్తిపల్లి మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.ఈ ఘటనపై బెంగళూరు రూరల్ ఎస్పీ మల్లికార్జున బాలదండి తెలిపారు. ‘రామస్వామిరెడ్డికి చెందిన గోదాములో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో గోదాములో 20 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. బాణసంచా ప్రమాదంపై తదుపరి విచారణ జరుపుతామని వారు తెలిపారు. క్యాంటర్‌లో బాణాసంచా దించుతుండగా మంటలు చెలరేగడంతో మంటలు కొద్దిసేపటికే దుకాణం, గోదాములకు వ్యాపించాయి. పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది ఆపరేషన్ చేపట్టారు. ప్రస్తుతం 80 శాతం మంటలను అదుపు చేశామని పోలీసులు తెలిపారు. అనేకల్ తహసీల్దార్ శివప్ప లమాని స్పందిస్తూ.. గోడౌన్ రామస్వామిరెడ్డికి చెందినదని, గోడౌన్‌కు అనుమతి ఉందని తెలిపారు. అయితే అన్ని నిబంధనలు పాటించారా అనేది చూడాలి. మంటలు ఆర్పిన తర్వాత తనిఖీలు చేస్తామని చెప్పారు.
కాగా ఈ ఘటనలో షాపు యజమాని నవీన్‌కు కూడా కాలిన గాయాలయ్యాయి.ప్రస్తుతం అగ్నిప్రమాదంపై ఖచ్చితమైన సమాచారం లేదు. FSL బృందం ధృవీకరణ తర్వాత మరిన్ని వివరాలు అందజేస్తామన్నారు. అదేవిధంగా షాపు లైసెన్స్‌ను పరిశీలిస్తున్నామని పోలీసులు, సంబంధిత అధికారులు తెలిపారు.
Karnataka: 12 dead after fire breaks out at firecracker store in Attibele, CM Siddaramaiah expresses grief
Read @ANI Story | https://t.co/jnIVCekQuE#Karnataka #fire #Siddaramaiah pic.twitter.com/cfRJaAja25
— ANI Digital (@ani_digital) October 7, 2023
कर्नाटक: अट्टीबेले में एक पटाखे की दुकान में आग लग गई। #karnatak #FIREWORK #crackers #firebrigadge #karnataktrends #fireviral pic.twitter.com/EU4dQ0KPze
— Vinod Tiwari (@tiwaryvinod) October 7, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..








