The 11A mystery: సీట్ 11A – 1998లో ఈ థాయ్‌లాండ్ నటుడ్ని కూడా కాపాడింది..
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో.. అందులో ప్రయాణించిన 242 మందికిగాను 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పెను ప్రమాదం నుంచి భారత సంతతికి చెందిన బ్రిటిషర్ రమేష్ విశ్వాస్ కుమార్ ఒక్కడే బతికి బయటపడ్డాడు. 11A సీటులో కూర్చుని ప్రయాణించడమే అతను బతకడానికి కారణమంటున్నారు. అయితే 11A సీటు అప్పట్లో ఓ థాయిలాండ్ నటుడ్ని కూడా కాపాడింది.

అహ్మదాబాద్ విమాన ప్రమాదపు ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురయ్యాలా చేసింది. ఘటన జరిగి మూడు రోజులు అవుతున్నా ప్రమాదపు దృశ్యాలు, చనిపోయిన కుటుంబాల ఆర్తనాదాలు ఇంకా కళ్ళముందే మెదులుతున్నాయి..ఒకవైపు విమాన ప్రమాద ఎలా జరిగింది అనే దానిపై అధికారుల దర్యాప్తు కొనసాగుతుంటే.. మరోవైపు మృతదేహాలను కుటుంబాలకు అప్పగించేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది.. అయితే ఈ ఘటనలో ప్రయాణించిన 242 మందిలో ఒకరు ప్రాణాలతో బయటపడగా.. విమానం కూలిన బీజే కాలేజ్‌లో క్యాంపస్ మెడికోలు 30కి పైగా మృత్యువాత పడ్డారు.. ఈ ఘటనలో బయటపడ్డ జస్వాస్ రమేష్‌ను చూసి అందరూ షాక్ కి గురయ్యారు… అతను కూర్చున్నటువంటి సీట్ 11A ఇప్పుడు అందరి నోటా చర్చనీయాంశంగా మారింది..
27 ఏళ్ల క్రితం కూడా ఇలాంటి ఘటన జరిగింది ఘోర విమాన ప్రమాదంలో చాలామంది చనిపోగా కేవలం 11 A లో కూర్చున్న ఓ నటుడు ఆ ఘటనలో ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ రెండు ఘోర విమాన ప్రమాదాలలో ఇద్దరు వ్యక్తులు కూడా అదే 11 ఏ సీట్లో కూర్చోవడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
1998లో థాయిలాండ్‌కు చెందినటువంటి ఎయిర్ వేస్ టీజీ 261 విమానం సౌత్ థాయిలాండ్‌లో ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ విమాన ప్రమాదంలో మొత్తం 146 మంది ప్రయాణించుగా దాదాపు 101 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. ఆ సమయంలో థాయిలాండ్‌కు చెందినటువంటి నటుడు, సింగర్ రువాంగ్‌సాక్ లోయ్‌చుసాక్ బ్రతికి ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పుడు అతని వయసు 20 ఏళ్లు. ఇటీవల అహ్మదాబాద్ లో జరిగినటువంటి విమాన ప్రమాదం గురించి తెలుసుకొని అప్పటి విమాన ప్రమాదాన్ని గుర్తు చేసుకుంటూ తాను కూడా సీట్ 11ఏలో కూర్చొని.. ప్రమాదం నుంచి బతికి బయటపడినటువంటి విషయాన్ని తెలిపారు. విశ్వాస్ కుమార్ కూడా 11 ఏ లో కూర్చొని మృత్యుంజయుడు అయ్యాడు అని తెలిసి గగుర్పాటుకు గురయ్యాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు రువాంగ్‌సాక్. ఈ విధంగా రెండు ఘోర ప్రమాదాలలో సీట్ 11 ఏ లో కూర్చున్నటువంటి ఇద్దరు మృత్యుంజయలుగా బయటపడటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
