AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంతోషంగా పెళ్లికి బయలుదేరారు.. ఒక్కసారిగా దూసుకొచ్చిన మృత్యువు.. 11 మంది దుర్మరణం..

బంధువుల ఇంట్లో వివాహ వేడుక మొదలైంది.. వారంతా నూతన వధూవరులను ఆశీర్వదించాలని సంతోషంతో కారులో బయలుదేరారు.. అంతా నవ్వుకుంటూ సరదాగా మాట్లాడుకుంటున్నారు.. ఈ తరుణంలో మృత్యువు వారందరినీ కబళించింది.

సంతోషంగా పెళ్లికి బయలుదేరారు.. ఒక్కసారిగా దూసుకొచ్చిన మృత్యువు.. 11 మంది దుర్మరణం..
Road Accident
Shaik Madar Saheb
|

Updated on: May 04, 2023 | 8:22 AM

Share

బంధువుల ఇంట్లో వివాహ వేడుక మొదలైంది.. వారంతా నూతన వధూవరులను ఆశీర్వదించాలని సంతోషంతో కారులో బయలుదేరారు.. అంతా నవ్వుకుంటూ సరదాగా మాట్లాడుకుంటున్నారు.. ఈ తరుణంలో మృత్యువు వారందరినీ కబళించింది. రెప్పపాటులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం.. ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఎస్‌యూవీ వాహనం ట్రక్కును ఢీకొనడంతో ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు సహా 11 మంది మృతి చెందినట్లు బలోద్ పోలీసులు తెలిపారు. బాధితులు, ధామ్‌తరి జిల్లాలోని సోరం-భట్‌గావ్ గ్రామానికి చెందిన వారని తెలిపారు. వీరంతా వివాహానికి వెళుతుండగా జాతీయ రహదారి-30పై పురూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగ్తారా గ్రామ సమీపంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగిందని పోలీసులు వివరించారు.

బాధితులు కాంకేర్ జిల్లా మర్కటోలా గ్రామంలో జరిగే వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళుతుండగా వారి వాహనం ట్రక్కును ఢీకొట్టిందని పురూర్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అరుణ్ కుమార్ సాహు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఎస్‌యూవీలో ఉన్న వారిలో పది మంది అక్కడికక్కడే మృతి చెందగా, ఒక చిన్నారి గాయాలతో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందిందని అరుణ్ కుమార్ సాహు తెలిపారు.

కాగా.. ఈ ఘటనపై ఛత్తీస్‌ఘడ్ సీఎం భూపేష్ బఘేల్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్