AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మానవత్వమా నీ చిరునామా ఎక్కడ..? కానరాని కూతుళ్లు.. బతికి ఉండగానే తనకు తానే శ్రాద్ధకర్మలు చేసుకున్న 103ఏళ్ల వృద్ధుడు

ప్రస్తుత రోజుల్లో మానవసంబంధాలు అన్నీ ఆర్ధిక బంధాలే.. భర్త భర్తల సంబంధం కడుపున పుట్టిన పిల్లలలు ఇవేమీ మనిషి జీవితంలో చివరి వరకూ తోడురావని.. బతికుండగానే అంత్యక్రియలు చేసుకున్న వృద్ధుడు! బ్రతికుండగానే ఓ వృద్ధుడు అంత్యక్రియలు చేసుకున్నాడు. మానవత్వమా నీ చిరునామా ఎక్కడ..

మానవత్వమా నీ చిరునామా ఎక్కడ..? కానరాని కూతుళ్లు.. బతికి ఉండగానే తనకు తానే శ్రాద్ధకర్మలు చేసుకున్న 103ఏళ్ల వృద్ధుడు
Surya Kala
|

Updated on: Feb 08, 2021 | 6:30 PM

Share

ప్రస్తుత రోజుల్లో మానవసంబంధాలు అన్నీ ఆర్ధిక బంధాలే.. భర్త భర్తల సంబంధం కడుపున పుట్టిన పిల్లలలు ఇవేమీ మనిషి జీవితంలో చివరి వరకూ తోడురావని.. బతికుండగానే అంత్యక్రియలు చేసుకున్న వృద్ధుడు! బ్రతికుండగానే ఓ వృద్ధుడు అంత్యక్రియలు చేసుకున్నాడు. మానవత్వమా నీ చిరునామా ఎక్కడ అని మనల్ని మనమే ప్రశ్నించుకునే ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్ లో చోటు చేసుకుంది.

ఉత్తరాఖండ్ లోని రాంపూర్ కు చెందిన శతాధిక వృద్ధుడు రూప్ రామ్ కు నా అన్నవారు ఎవరూ లేరు.. జీవితాంతం తోడునీడగా ఉంటాను అని బాస చేసిన భార్య చాలాకాలం క్రితమే మరణించింది. కడుపున పుట్టిన ఇద్దరు కూతుర్లు ఇక అప్పటి నుంచి తండ్రి వద్ద కు రావడం మానేశారు. అసలు వారు ఎక్కడ ఉన్నారో కూడా రూప్ రామ్ కు తెలియదు. వయసు మీద పడడంతో అతనికి ఓ అలోచన రావడం మొదలైంది. తనకు ఎవరూ లేరు.. తాను మరణిస్తే.. అంత్యక్రియలు చేయడానికి కూడా ఎవరూ ముందుకు రారు అని ఆ వృద్ధుడు గుర్తించాడు. వెంటనే స్థానికంగా ఉన్న పూజారిని సంప్రదించాడు.

ఆ పూజారి పున్నామ న‌ర‌కం నుంచి త‌ప్పించుకునేందుకు ఎవ‌రైనా త‌మ‌కు తామే అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించుకునే అవ‌కాశం ఉంద‌ని చెప్పాడు. పూజారి ఇచ్చిన సూచనతో హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం తన అంత్యక్రియలు, కర్మకాండను తానే నిర్వహించుకున్నాడు. మంత్రోచ్ఛరణలు, బ్యాండ్ మేళం చ‌ప్పుళ్ల‌తో ఘనంగా తంతు జరిపించుకున్నాడు. అనంతరం గ్రామస్తులకు రకరకాల వంటలతో భోజనాన్ని కూడా పెట్టాడు.

ఇదే విషయంపై రూప్‌రామ్ మీడియాతో మాట్లాడుతూ.. తన ఇద్దరు బిడ్డలు చిన్నగా ఉన్నప్పుడే తన భార్య చనిపోయిందని, ఆ తర్వాత త‌న బిడ్డ‌లు కూడా ఎవ‌రి బ‌తుకును వాళ్లు వెతుక్కుంటూ వెళ్లిపోయార‌ని, ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో కూడా తెలియదని కంట‌త‌డి పెట్టాడు. ఒంటరైనా తనకి రేపు చనిపోతే అంత్యక్రియలు చేసే వాళ్ళు ఎవ్వరు కూడా లేక‌పోవ‌డంతో బ‌తికుండ‌గానే తన క‌ర్మకాండ‌లు తానె చేసుకున్నాన‌ని తెలిపాడు. అందరూ ఉండి అనాధగా మారిన ఈ వృద్ధుడు వ్యధ అందరినీ కంట నీరు పెట్టిస్తోంది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటువంటి కూతుర్లు ఎవరికీ వద్దని.. రూప్ రామ్ కి వచ్చిన కష్టం శత్రువుకు కూడా రాకూడదని కామెంట్స్ చేస్తున్నారు. కన్నీరు పెడుతున్నారు.

Also Read:

ఢిల్లీకి పవన్‌ కల్యాణ్‌ పయనం… స్టీల్‌ ప్లాంట్‌పై బుస్సుమంటారా..? తుస్సుమంటారా..?

మొదటి భార్య పిల్లలున్నా .. రెండో పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి.. ఇద్దరు భార్యలకు అసలు విషయం తెలిసాకా..!