AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీకి పవన్‌ కల్యాణ్‌ పయనం… స్టీల్‌ ప్లాంట్‌పై బుస్సుమంటారా..? తుస్సుమంటారా..?

జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. పవన్‌ వెంట పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్..

ఢిల్లీకి పవన్‌ కల్యాణ్‌ పయనం... స్టీల్‌ ప్లాంట్‌పై బుస్సుమంటారా..? తుస్సుమంటారా..?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్
K Sammaiah
|

Updated on: Feb 08, 2021 | 6:16 PM

Share

జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. పవన్‌ వెంట పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఢిల్లీ బాట పట్టారు. భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వంతో ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితిపై చర్చించనున్నారు.

ప్రధానంగా- తెలుగు వారి ఆత్మగౌరవానికి, ఆకాంక్షలకు ప్రతీక అయిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకొనే అంశంపై చర్చించనున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఇప్పటికే బీజేపీ పెద్దలతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. రేపు బిజెపి జాతీయ అధ్యక్షులు నడ్డాతో భేటీ కానున్నట్లు తెలుస్తుంది.

నడ్డా అపాయింట్మెంట్ ఖరారు కావడంతో పవన్, నాదెండ్ల మనోహర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించు కోవాలని పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి చేయనున్నారు. కేంద్రం నిర్ణయంపై ఇప్పటికే సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయాన్ని నడ్డా దృష్టికి తీసుకురానున్నారు.

Read more:

వేప చెట్టును కొట్టేసిన వ్యక్తులకు భారీ జరిమానా.. ఎనమిదో తరగతి బాలుడి ఫిర్యాదుతో కదిలిన అటవీ శాఖ